‘సర్జికల్ స్ట్రైక్’పై కేంద్రం అనూహ్యం -ఏం జరిగిందో తెలీదన్న హోం మంత్రి కిషన్ రెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ పై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. బీజేపీకి మేయం పీఠం దక్కితే హైదరాబాద్ ఓల్డ్ సిటీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని హెచ్చరించిన బండిపై మంత్రి కేటీఆర్, ఇతర పార్టీల నేతలు మండిపడ్డారు. సంజయ్ వ్యాఖ్యలను కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమర్థిస్తారా? అని కేటీఆర్ సవాలు విసిరారు. తీంతో కేంద్రం స్పందించక తప్పలేదు..
దూసుకొస్తున్న నివర్ తుపాను -బుధవారం సెలవు -సాయంత్రం కాదు, రాత్రికే తీరం దాటనుంది..

అసలేం జరిగిందంటే..
బల్దియా ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య ‘రొహింగ్యా ముస్లిం శరణార్థుల'పై సవాళ్లు ప్రతిసవాళ్లు తలెత్తాయి. హైదరాబాద్ లో నివసిస్తోన్న రోహింగ్యాలు, పాకిస్తానీ, బంగ్లాదేశీ ముస్లింలను ఓటరు జాబితాలో చేర్చి ఎంఐఎం లబ్దిపొందుతోందని బీజేపీ నేతలు ఆరోపించగా, అసలా శరణార్థులకు కేంద్ర ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితులు ప్రత్యేకంగా ఐడీ కార్డులు ఇచ్చి పంపిందని, నిజంగా చొరబాటు దారులు ఉన్నట్లయితే కేంద్ర మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సవాలు విసిరారు. దానికి కౌంటర్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవి వివాదాస్పదంగా ఉండటంతో రాజకీయ రచ్చ చెలరేగింది..
వ్యాక్సిన్ వేసుకున్నా కొవిడ్-19వ్యాధి? -సమర్థత, సరఫరాపై గందరగోళం -ఈ ప్రశ్నలకు బదులేది?

కేటీఆర్ ఖండన.. కేంద్రానికి ప్రశ్న..
గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి, బీజేపీ గనుక మేయం పీఠం దక్కించుకుంటే.. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేసి.. అక్కడ నివసిస్తోన్న రోహింగ్యాలను, పాకిస్థానీలను తరిమి కొడతామని బండి సంజయ్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఖండించారు. నాలుగు ఓట్లు రెండు సీట్ల కోసం ఇంత దిగజారి మాట్లాడుతారా? పచ్చని హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తారా? అని ఆగ్రహించారు. సంజయ్ వ్యాఖ్యలను కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ఈలోపే..

బీజేపీకి డెడ్ లైన్..
కేటీఆర్ సవాలుపై కిషన్ రెడ్డి స్పందించేలోపే, బండి సంజయ్ కి అసదుద్దీన్ కౌంటరిచ్చే ప్రయత్నం చేశారు. ‘‘ఇక్కడ నివసిస్తోన్నవాళ్లందరూ భారతీయులే. బీజేపీకి 24 గంటల సమయం ఇస్తున్నాం. పాతబస్తిలో పాకిస్తాన్ వాళ్లెవరున్నారో చెప్పాలి. చైనా 1000 కిలోమీటర్ల భూభాగాన్ని అక్రమించింది. దమ్ముంటే అక్కడకు వెళ్లి అమిత్‌షా సర్జికల్ స్ట్రైక్ చేయాలి. దేశం నుంచి ముస్లింలను వేరు చేయలేరు. టెర్రరిస్టులు, పాకిస్తాన్ పదాలు లేకుండా ప్రచారం చేయగలరా? దమ్ముంటే చదువు, అభివృద్ధి గురించి చెప్పి గెలవాలి'' అని ఓవైసీ అన్నారు. ఇక,

కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
తెలంగాణ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగడం, మంత్రి కేటీఆర్ సాలు చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మీడియా సంప్రదించగా, ఆయన అనూహ్యరీతిలో స్పందించారు. ‘‘ఉదయం నుంచి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాను. సంజయ్ ఏం మాట్లాడారో.. కేటీఆర్ ఏమని ట్వీట్ చేశారో నాకు తెలీదు.. అయితే హైదరాబాద్ ఎన్నికల్లో జనం బీజేపీవైపు ఉన్నారని మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను. దేశాన్ని సమర్థవంతంగా పాలిస్తోన్న బీజేపీ.. హైదరాబాద్ ను కూడా సమర్థవంతంగా పాలించి, అభివృద్ధి చేస్తుంది'' అని కిషన్ రెడ్డి చెప్పారు.