హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ అవినీతి పాలనకు త్వరలో చెక్ పెడతాం: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు, కూతురు, అల్లుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. నోరు తెరిస్తే బూతులు, అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు.

ప్రజా సమస్యలను గాలికి వదిలేసి జేబులు నింపుకొనే పనిలో పడ్డారని మండిపడ్డారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి పాలనకు చెక్ పెడుతామన్నారు. రైతుల పక్షపాతి అయిన‌ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మోడీకి భారతదేశ ప్రజలే కుటుంబమని, కేసీఆర్ కు మాత్రం ఆయన కుటుంబ సభ్యులే ముఖ్యమని విమర్శించారు.

Union minister Pralhad Joshi slams CM KCR for corruption issue.

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పర్యటించారు. మణికొండలోని ఓ ఫంక్షన్ హాల్ లో.. పండిట్ దీన్ దయాళ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పండిట్ దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం మణికొండలోని దళిత మోర్చా అధ్యక్షుడు వినోద్ ఇంట్లో అల్పాహారం చేశారు.

ఇటీవల అనారోగ్యంతో మరణించిన మణికొండ వార్డు కౌన్సిలర్ వందన నాగేష్ కుటుంబాన్ని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత బండ్లగూడలో ఏర్పాటు చేసిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలోనూ ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రేమేందర్, స్వామి గౌడ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
Union minister Pralhad Joshi slams CM KCR for corruption issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X