హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెంట్రల్ యూనివర్సిటీలో విషాదం.. PhD విద్యార్థిని బాత్రూమ్‌లో అనుమానస్పద మ‌ృతి..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : గచ్చిబౌలిలోని సెంట్రల్‌ యూనివర్శిటీలో పీహెచ్‌డీ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో చనిపోయింది. ఖరగ్‌పూర్ ప్రాంతానికి చెందిన 29 సంవత్సరాల దీపికా మహాపాత్ర హిందీ విభాగంలో డాక్టరేట్ చేస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బాత్రూమ్‌లో చనిపోయినట్లు తోటి స్నేహితులు గుర్తించారు. ఆ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో వర్సిటీకి చేరుకున్నారు.

గత కొంతకాలంగా ఆమె న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే బాత్రూమ్‌కు వెళ్లిన దీపికా కళ్లు తిరిగి పడిపోయి ఉండొచ్చని సమాచారం. ఆ క్రమంలోనే ఆమె చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె బాత్రూమ్‌కు వెళ్లి చాలాసేపవుతున్నా.. ఎంతకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థినులు వెళ్లిచూడగా అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు సమాచారం.

Recommended Video

కొయ్యలగూడెం లో బాలిక అదృష్యం
University of Hyderabad PhD student dies in bathroom

ఆస్తి కోసం అమ్మకు వేధింపులు.. కొడుకు, కోడలుకు జైలుశిక్ష..!ఆస్తి కోసం అమ్మకు వేధింపులు.. కొడుకు, కోడలుకు జైలుశిక్ష..!

దాంతో వారు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే దీపిక మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆ మేరకు దీపికకు సంబంధించిన పాత మెడికల్ రిపోర్టులతో పాటు తోటి స్నేహితులను వారి బంధువులను విచారించడంతో ఆమె న్యూరో సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. అయితే పూర్తి దర్యాప్తు తర్వాత అసలేం జరిగిందనే క్లారిటీ వచ్చే అవకాశముంది.

English summary
A student died under suspicious conditions in University of Hyderabad on Monday. According to Gachibowli Police, the student identified as Deepika Mahapatra (29). She belongs to Orissa and was doing PhD in Hindi at the university. Based on the primary information, police are suspecting Neurological abnormality, due to which she might have died in suspicious conditions in bathroom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X