రాడ్ రంబోళ: టీడీపీ పగ్గాలను చంద్రబాబు చేతికి ఎందుకిచ్చావ్: బాలకృష్ణకు మోహన్‌బాబు సూటిప్రశ్న
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరో, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ.. తన కేరీర్‌లోనే మొదటిసారిగా ఓ టాక్‌షోనకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నారు. ఇదివరకు చాలామంది ఇండస్ట్రీ పెద్దలు టాక్‌షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు, జూనియర్ ఎన్టీఆర్, నాని, అక్కినేని నాగార్జున, రానా, అలీ, మంచు లక్ష్మి, సమంత.. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన ఇలా అగ్రస్థాయి దర్శకులు, హీరోలు హోస్ట్‌గా తళుక్కున మెరిసిన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదివరకు ఓ షో కోసం హోస్ట్‌గా అవతారం ఎత్తారు.

నందమూరి టర్న్
ఇప్పుడు నందమూరి బాలకృష్ణ వంతు వచ్చింది. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు చెందిన ఆహాలో ఈ టాక్ షో టెలికాస్ట్ కానుంది. తఅనా పేరు అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. దేవీ శరన్నరవ రాత్రుల సందర్భంగా ఈ షోను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. నవంబర్ 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ఇది టెలికాస్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రీ ఫంక్షన్‌ను గురువారం రాత్రి నిర్వహించారు దీన్ని కర్టెన్ రైజర్‌గా భావించుకోవచ్చు.

అలీ టాక్ షో పోటీ..
ఓ బిగ్గెస్ట్ టాక్‌షోనకు అదే రేంజ్ బిగ్గెస్ట్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఉండటం వల్ల దీనిపై అంచనాలు అమాంతం పెరిగాయి. అందులోనూ స్టార్ ప్రొడ్యూసర్ హోదా ఉన్న అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఇది ప్రసారం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలీ టాక్‌షోనకు పోటీగా దీన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీదికి తీసుకొస్తున్నారని అభిప్రాయాలు నెలకొన్నాయి.
అలీ టాక్‌షో విజయవంతమైన నేపథ్యంలో- దాన్ని అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకేను డిజైన్ చేశారని అంటున్నారు. ఏ రేంజ్లో ఇది సక్సెస్ అవుతుందనేది తేలాల్సి ఉంది. రెగ్యులర్ టీవీ ప్లాట్‌ఫామ్ కాకపోవడం వల్ల ప్రజల్లోకి ఎలా చొచ్చుకెళ్తుందనేది ఆసక్తిగా మారింది.

ప్రోమో విడుదల..
ఈ షోనకు సంబంధించిన మొట్టమొదటి ప్రోమోను ఆహా- కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. 3:02 సెకెన్ల పాటు ఉన్న ఈ ప్రోమో- ఈ టాక్‌షోలో ఎలా ఉండబోతోందనేది తేల్చి చెప్పింది. ఇద్దరు సీనియర్ నటులు ఒకే వేదికను పంచుకుంటే.. దాని సీరియస్‌నెస్, హిలేరియస్నెస్ ఎలా ఉంటుందనేది చూడొచ్చు. మొదటి ఎపిసోడ్లో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, ఆయన కుమార్తె లక్ష్మి మంచు, కుమారుడు మంచు విష్ణు పాల్గొన్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందటే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. తాజాగా ఆహా యాజమాన్యం- ప్రొమోను విడుదల చేసింది.

సినిమాలు, రాజకీయ జీవితంపై
హోస్ట్ నందమూరి బాలకృష్ణ, మోహన్‌బాబు మధ్య ఆసక్తికరమైన సంభాషణ సాగింది. మోహన్‌బాబు సినిమా, రాజకీయ జీవితంలోని కొన్ని సున్నితాంశాలను బాలకృష్ణ స్పృశించారు. సూటిగా వాటి గురించి ప్రశ్నించారు. అదే సమయంలో- మోహన్ బాబు కూడా కొన్ని ప్రశ్నలను సంధించారు బాలకృష్ణకు. సూటిగా సమాధానం చెప్పాలనీ అడిగారు. ఆయా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయా? లేదా? అనేది ఆ ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది.

టీడీపీ పగ్గాలు చంద్రబాబుకు ఎందుకు ఇచ్చావ్..
తెలుగుదేశం పార్టీని స్థాపించింది అన్నగారు నందమూరి తారకరామారావు గారు అయితే.. ఆయన తదనంతరం టీడీపీ పగ్గాలను నువ్వు చేత పట్టుకోకుండా చంద్రబాబు నాయుడికి ఎందుకిచ్చావ్? అంటూ మోహన్ బాబు నేరుగా బాలకృష్ణకు ప్రశ్నిస్తారు. ఆ ఒక్క ప్రశ్న తప్ప- అంటూ బాలకృష్ణ దాట వేయడం ఈ ప్రోమోలో కనిపిస్తుంది. అన్నగారు ఒక పార్టీని పెట్టి.. మరో పార్టీలోకి ఎందుకు వెళ్లారు అంటూ నందమూరి బాలకృష్ణ నీళ్లు నమలడం చూడొచ్చు.

చిరంజీవి మీద అభిప్రాయం కూడా..
ఈ ప్రోమోలో హస్ట్ బాలకృష్ణ.. మోహన్‌బాబుకు పలు ప్రశ్నలను సంధిస్తారు. మెగాస్టార్ చిరంజీవి మీద నిజంగా ఎలాంటి అభిప్రాయం ఉందో స్పష్టం చేయాలని బాలయ్య.. మోహన్‌బాబును ప్రశ్నిస్తారు. అలాగే- ఇది పర్సన్ క్వశ్చన్ అని.. సాయంత్రం 7:30 గంటల తరువాతి ప్రశ్న అంటూ టాపిక్ పెగ్గుల మీదికి మళ్లుతుంది.
హీరోగా నిలబడాలనే ప్రయత్నం విఫలమౌతున్న సమయంలో ఎప్పుడైనా బాధపడ్డారా? అంటూ మరో ప్రశ్నను వేస్తారు. తలచుకుంటే ఏడుపొస్తుంది సోదరా?, నా బిడ్డలకు మోసం చేస్తున్నాను. నా ఇళ్లు అమ్మేశానునో బడీ హెల్ప్. చేతికి ఎంత వస్తే అంత ఇచ్చేవాణ్ని.. అంటూ మోహన్‌బాబు సమాధానం చెబుతారు.

అరవిందే ఈ ప్రశ్నలు నన్ను అడగమని నీకు చెప్పి ఉంటాడంటూ..
ఈ షో సాక్షిగా.. అడుగుతున్నా. నేను మిమ్మల్ని ఎప్పుడైనా బాధపెట్టానా? అంటూ బాలకృష్ణను ప్రశ్నిస్తారు. వాటన్నింటికీ మోహన్ బాబు ర్యాండమ్‌గా ఒకే సమాధానం ఇచ్చినట్టు కనిపించింది. అల్లు అరవిందే ఈ ప్రశ్నలన్నింటినీ అడగమని నీకు చెప్పి ఉంటాడు.. అంటూ మోహన్‌బాబు బదులిస్తారు. అస్సలు చూడలేని సినిమా ఏదైనా ఉందా ప్రశ్నించగా.. పటాళం పాండు అని ఓ సినిమా ఉందని మోహన్ బాబు రిప్లై ఇస్తారు.
ఆ సినిమా అంత రాడ్ రంబోళనా? అంటూ బాలకృష్ణ భళ్లున నవ్వేస్తారు. లక్ష్మీ ఈ మధ్య అబద్ధాలు నేర్చుకుంది గానీ.. విష్ణు అబద్ధాలు చెప్పడు అంటూ మోహన్ బాబు తన ఇద్దరు పిల్లల గురించి ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తారు.

ఇంట్రడక్షన్ ఇవ్వకముందే వచ్చేస్తారంటూ..
మోహన్ బాబు గురించి బాలకృష్ణ ఇవ్వడం ఈ ప్రోమోలో కనిపించింది. ఎవరి జీవితం కళా ప్రపూర్ణమో.. ఎవరి జీవితం సంపూర్ణమో.. ఆయనే.. అంటూ చెప్పబోతోండగా మోహన్ బాబు డయాస్ మీదికి వచ్చేస్తారు. దీనితో బాలకృష్ణ సున్నితంగా విసుక్కుంటారు. ఛాదస్తం.. ఇంట్రడక్షన్ కాకూండానే వచ్చేస్తారు.. అని చెబుతారు. జూమ్ అన్నారు. ఇన్స్టాగ్రామ్ అన్నారు. ఎక్కడ పడితే అక్కడ పెడతానని అన్నారు.. అంటూ బాలకృష్ణ ఓ గేమ్ విషయంలో మోహన్‌బాబును ఎద్దేవా చేస్తారు.