హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీడిమెట్లలో యోగి ఆదిత్యనాత్ ప్రచారం.. రంగంలోకి అగ్రనేతలు

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం హీటెక్కింది. మేయర్ పీఠం దక్కించుకోవడమే ధ్యేయంగా ప్రధాన పార్టీలు పనిచేస్తున్నాయి. బీజేపీ అగ్ర నాయకులు ప్రచార పర్వంలో దిగారు. ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు.

తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు తథ్యం.. గ్రేటర్ క్యాంపెయిన్‌లో బండి సంజయ్ సంచలనంతెలంగాణలో మధ్యంతర ఎన్నికలు తథ్యం.. గ్రేటర్ క్యాంపెయిన్‌లో బండి సంజయ్ సంచలనం

గ్రేటర్ ప్రచారం కోసం మధ్యాహ్నం యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్టులో ఆయనకు నేతలు స్వాగతం పలికారు. అక్కడే స్థానిక బీజేపీ నేతలతో యోగి ఆదిత్యనాథ్ మంతనాలు జరిపారు. తర్వాత అక్కడినుంచి జీడిమెట్ల వెళ్లారు. అక్కడ ప్రచార సమరశంఖం పూరిస్తారు.

up cm yogi adityanath campaign jeedimetla

ఎన్డీఏ హయాంలో చేసిన అభివృద్ధిని యోగి ప్రస్తావించనున్నారు. బల్దియాలో తమ పార్టీకి అవకాశం కల్పించాలని కోరబోతున్నారు. రేపు హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రచారం చేస్తారు. రేపటితో ప్రచార పర్వం ముగియనుంది. సాయంత్రం 6 గంటల లోపు ప్రచారం ముగించాలని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఆ తర్వాత ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. డిసెంబర్ 1వ తేదీన పోలింగ్, అవసరమైతే 3వ తేదీన రీ పోలింగ్ నిర్వహిస్తారు. 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు.

English summary
up chief minister yogi adityanath campaign jeedimetla.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X