హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భారీ భద్రత, రేపు అమ్మవారి సేవలో యోగి ఆదిత్యనాథ్

|
Google Oneindia TeluguNews

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో హైదరాబాద్ కాషాయ వర్ణంలోకి మారింది. సమావేశం జరిగే హెచ్ఐసీసీ వద్దకు బీజేపీ శ్రేణులు చేరుకున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా సిటీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. పాతబస్తీ, చార్మినార్ పరిధిలో గల భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అణువణువు దుర్భేద్యంగా మారింది.

భాగ్యలక్ష్మీ అమ్మవారు

భాగ్యలక్ష్మీ అమ్మవారు


ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. షెడ్యూల్ ప్రకారం శనివారం భాగ్యలక్ష్మీ ఆలయాన్ని ఆదిత్య నాథ్ సందర్శించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం ఆదివారానికి వాయిదా పడింది. యోగి ఆదిత్యా నాథ్ ఆదివారం అమ్మవారిని దర్శించుకుంటారు. దీంతో శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

 భద్రత కట్టుదిట్టం

భద్రత కట్టుదిట్టం


కేంద్ర బలగాలు కూడా భద్రతలో పాల్గొంటున్నాయి. హైదరాబాద్ సిటీ మొత్తం సిటీ ఆర్మీ రిజర్వ్‌డ్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ తెలంగాణ పోలీస్ బెటాలియన్ ఆధ్వర్యంలో ప్రొటెక్షన్ కొనసాగుతోంది. సౌత్ డీసీపీ చైతన్య భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చార్మినార్ వద్ద బైక్ ర్యాలీ చేసేందుకు టీఆర్ఎస్ నేతలు యత్నించడం కాంట్రవర్సీకి దారితీసింది. పోలీసులు బైక్ ర్యాలీని అడ్డుకున్నారు.

 రెండు రోజులు సెషన్

రెండు రోజులు సెషన్


ఇవాళ రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇటు ఇవాళే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. తర్వాత జలవిహార్‌లో కేసీఆర్ ప్రసంగించారు. టీఆర్ఎస్ నేతలు అంతా ఇక్కడ ఉండగా.. బేగంపేటలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఆయనే ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలికారు

English summary
utter pradesh cm yogi adityanath tomorrow offered prayers to devotee bhagyalaxmi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X