హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో యూరియా లొల్లి.. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. మధ్యలో బీజేపీ..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో యూరియా లొల్లి ముదురుతోంది. రైతుల పట్ల ఏ పార్టీ నేతలకు ఎంత ప్రేమ ఉందో తెలియదు కానీ.. అన్నీ పార్టీల నేతలు మాత్రం గట్టిగానే స్పందిస్తున్నారు. చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే.. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, మధ్యలో బీజేపీ అన్నట్లుగా మారింది యవ్వారం. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రం కారణమని టీఆర్ఎస్ నేతలు వాదిస్తుంటే.. యూరియా షార్టేజ్‌తో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది కాంగ్రెస్ లీడర్ల వెర్షన్. అదంతా అలా ఉంటే బీజేపీ నేతలు మాత్రం కేంద్ర ప్రభుత్వం యూరియా వీలైనంత ఎక్కువగా ఇస్తున్నప్పటికీ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించడం చర్చానీయాంశమైంది.

 తెలంగాణలో యూరియా కొరత.. 3 పార్టీల నేతల మధ్య మాటల తూటాలు

తెలంగాణలో యూరియా కొరత.. 3 పార్టీల నేతల మధ్య మాటల తూటాలు

తెలంగాణలో యూరియా అంశం మూడు పార్టీల మధ్య చక్కర్లు కొడుతోంది. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం కారణమంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఆ క్రమంలో గులాబీ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి బీజేపీ నేతలను ఏకి పారేశారు. అసలు తెలంగాణలో యూరియా కొరతకు కేంద్రమే కారణమంటూ ఫైరయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటా తెప్పించడంలో రాష్ట్ర బీజేపీ నేతలు విఫలమయ్యారని మండిపడ్డారు. ఇక్కడి బీజేపీ నేతలు ఢిల్లీలో కూర్చుని పనికిమాలిన రాజకీయాలు చేస్తూ తెలంగాణ అభివృద్దిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. పది రోజుల్లో యూరియా కొరతను అధిగమించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

క్యాడర్ ఉంది సరే, మరి లీడర్లు.. ఆ కోటలో కమలం పువ్వు వికసించేనా..!క్యాడర్ ఉంది సరే, మరి లీడర్లు.. ఆ కోటలో కమలం పువ్వు వికసించేనా..!

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విసుర్లు

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విసుర్లు

తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో పడిందంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. యూరియా కొరత కారణంగా మెదక్ జిల్లా దుబ్బాకలో రైతు మృతి చెందడం బాధాకరమన్నారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన భట్టి పలు అంశాలను ప్రస్తావించారు. రుణ మాఫీ కూడా పెండింగ్‌లో పెట్టడంతో రైతులపై అదనపు భారం పడుతోందన్నారు.

మంత్రి నిరంజన్ రెడ్డి స్పందన

మంత్రి నిరంజన్ రెడ్డి స్పందన

మల్లు భట్టి విక్రమార్క ఆరోపణలపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. దుబ్బాకలో రైతు మృతికి, యూరియా కొరతకు సంబంధం లేదన్నారు. అక్కడ రైతు మృతి యాదృచ్చికంగా జరిగిందే తప్ప.. యూరియా కొరత కారణం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో యూరియా సరిపడా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి రావాల్సిన యూరియా వరదల కారణంగా ఆలస్యం అవుతోందన్నారు. అక్కడినుంచి ట్రక్కులు లేటుగా వచ్చాయే తప్ప.. యూరియా కొరత లేదని స్పష్టం చేశారు.

కేంద్రం ఇచ్చిందిగా.. పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వమే విఫలం అంటున్న అర్వింద్

కేంద్రం ఇచ్చిందిగా.. పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వమే విఫలం అంటున్న అర్వింద్

అదలావుంటే తెలంగాణకు కావాల్సిన దానికంటే ఎక్కువగానే యూరియా కోటా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందంటున్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. యూరియా కొరతపై గురువారం నాడు మీడియాతో మాట్లాడిన అర్వింద్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణాస్త్రాలు సంధించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాలిక లోపం వల్లే యూరియా కొరత ఏర్పడిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యూరియాను రైతులకు పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఫైరయ్యారు.

English summary
Urea Shortage In Telangana Cause to Fight between TRS and Congress Leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X