హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాష్ బేసిన్ పగిలిందా?.. డోంట్ వర్రీ.. నూడుల్స్‌తో అతికించొచ్చు (వీడియో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వంటింటికి చేరిన టూ మినిట్స్ నూడుల్స్ గృహిణులకు వరంలా మారాయి. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఉరుకుల పరుగులతో సతమయ్యే వంటింటి దేవతలకు టూ మినిట్స్ నూడుల్స్ బాగా దగ్గరయ్యాయి. టైమ్ కుదరని పక్షంలో పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ ఐనా, లంచ్ బాక్సైనా నూడుల్స్ ఉందిగా అంటూ చకచకా పొయ్యి వెలగించి రెండే రెండు నిమిషాల్లో ఆ తంతు ముగించేస్తారు.

అయితే చాలామందికి నూడుల్స్ అనగానే అదే వంటింటి సీన్ గుర్తుకొస్తుంది. కానీ, అదే నూడుల్స్‌తో పగిలిపోయిన వాష్ బేసిన్ ను తిరిగి బాగు చేయొచ్చు తెలుసా. నూడుల్సేంటి, వాష్ బేసిన్ పగలడమేంటి, బాగు చేయడమేంటి అనుకుంటున్నారా. నో కన్ఫ్యూజన్.. ఈ వీడియో చూస్తే మీరే ఒక కన్‌క్లూజన్‌కు వస్తారు.

Use Maggi To Fix Broken Sink

ఆలయాల్లో ఇంటి దొంగలు.. మొన్న బాసర.. నేడు కొమురెల్లి మల్లన్న బంగారం మాయంఆలయాల్లో ఇంటి దొంగలు.. మొన్న బాసర.. నేడు కొమురెల్లి మల్లన్న బంగారం మాయం

వాష్ బేసిన్స్ పగిలితే కొత్తది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.. ప్లంబర్‌ను పిలిచి వందలు వందలు పోగొట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. జస్ట్, మీ వంటింట్లో ఉండే నూడుల్స్ తీసుకుని ఎంచక్కా తిరిగి అతికించొచ్చు. పిల్లలు ఆడి పాడే సమయంలో వారి కారణంగా వాష్ బేసిన్ పగిలిపోతే చిందులేయకండి. నూడుల్స్ తీసుకుని బాగు చేసే పని మొదలుపెట్టండి. సో, సింపుల్. ఈ వీడియో చూస్తే ఫుల్లుగా మీకే అర్థమవుతుంది.

వాస్తవానికి ఈ వీడియోను మారియా ఫెర్నండా ఇంటీరియర్స్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. చూసినోళ్లు చాలామంది భిన్నరకాలుగా స్పందించారు. అయితే ఇదే వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్‌లో ఈనెల 15వ తేదీన షేర్ చేశారు. రెండు రోజుల వ్యవధిలోనే 7 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం విశేషం.

English summary
A man uses an uncooked noodle cake to fix his sink. This Video viral in social media. The video was first posted on Instagram by a page called 'Maria Fernanda Interiores and then shared on Twitter by an user, where it started going viral. Posted on 15th May, the video has over 7.5 million views.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X