హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీకి అంత సీన్ లేదు.. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమన్న ఉత్తమ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ గట్టు మీద అధికారం కంటే ప్రతిపక్షంపైనే ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ చేశాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుండగా .. ప్రతిపక్ష పాత్ర తమదేనని కాంగ్రెస్, బీజేపీ పోటిపడుతున్నాయి. సీఎల్పీ .. టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనమవడంతో ... బీజేపీ నేతలు స్వరం పెంచారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి విజయవకాశాలు లేవని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హిందు-ముస్లింలను విభజించి రాజకీయం చేయాలని బీజేపీ చూస్తుందని విమర్శించారు. మిగతా చోట్ల మాదిరిగా తెలంగాణలో అది సాధ్యం కాదని తేల్చిచెప్పారు. బీజేపీలో చేరే వారు ఎవరూ లేకపోయపోయిన ప్రచార ఆర్బాటం మాత్రం మెండుగా ఉందని విమర్శించారు.

uttam criticize bjp religion politics

తెలంగాణ కోసం బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన కాంగ్రెస్ పార్టీ సిద్దమని స్పష్టంచేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించే సత్తా తమకే ఉందని .. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులతో విజయం తథ్యమని తేల్చిచెప్పారు. టీ పీసీసీ చీఫ్ మార్పు ఏఐసీసీ పరిశీలనలో లేదని రాష్ట్ర కాంగ్రెష్ ఇంచార్జీ కుంతియా స్పష్టంచేశారు. మున్సిపల్ ఎన్నికలు, హుజూర్ నగర్ ఉఫ ఎన్నిక, సభ్యత్వ నమోదు అంశాలపై ఫోకస్ చేస్తున్నామని పేర్కొన్నారు.

English summary
BJP has no chance of success Telangana state , said T pcc chief Uttam Kumar Reddy. He criticized the BJP for dividing Hindu-Muslims and politicizing it. Telangana concluded that it is not possible, as elsewhere. Those who join the BJP have criticized the lack of any propaganda campaign. Asked what BJP has done for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X