హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్కడ మోడీ.. ఇక్కడ కేసీఆర్: భయం లేదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేసేది కాంగ్రెస పార్టీనేనని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు తిరిగి పార్టీలోకి రావాలని ఆయన కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం మాట్లాడుతూ.. కేసీఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు.

తప్పుకుంటున్నా..! : కొత్త సంవత్సర వేళ ఉత్తమ్ సంచలన నిర్ణయం!!తప్పుకుంటున్నా..! : కొత్త సంవత్సర వేళ ఉత్తమ్ సంచలన నిర్ణయం!!

దోపిడీ పాలన..

దోపిడీ పాలన..

టీఆర్ఎస్‌ది కుటుంబ పాలన, దోపిడీ పాలన అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
కేసీఆర్ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన ఒక్క మాట కూడా నెరవేర్చలేదని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు కూడా ఇవ్వలేదని కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు.

టీఆర్ఎస్ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు..

టీఆర్ఎస్ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు..


తాను మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడితే.. టీఆర్ఎస్ వాళ్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు అయ్యాక.. నామినేషన్‌కు వారం గడువు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆరుసార్లు గెలిచిన తనకు ఎన్నికలంటే భయం లేదని ఆయన అన్నారు.

అక్కడ మోడీ.. ఇక్కడ కేసీఆర్..

అక్కడ మోడీ.. ఇక్కడ కేసీఆర్..

తెలంగాణ సర్కారు రైతు రుణమాఫీ, రైతు బంధు, నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మతపరంగా మోడీ దేశాన్ని.. అప్పులపరంగా రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలిపారు.

రాజీనామ చేస్తాననడంలో కలకలం..

రాజీనామ చేస్తాననడంలో కలకలం..

కాగా, ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. తాను త్వరలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో పార్టీ తదుపరి అధ్యక్షుడు ఎవరనేదానిపై విస్తృత చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని త్వరలోనే నియమిస్తుందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది సీనియర్ నేతలు పోటీలో ఉండటం గమనార్హం.

English summary
Telangana pcc chief Uttam Kumar Reddy hits out at Telangana CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X