హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో కీలక సమావేశం .. భగ్గుమన్న సీనియర్లు .. కాంగ్రెస్ లో వర్గ విబేధాలు

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గానికి , కొందరు సీనియర్లకు పోసగతం లేదనేది అందరికీ తెలిసిన విషయమే . కాంగ్రెస్ పార్టీలో కలహాలు, వర్గ విబేధాలు మొదట నుండి కొనసాగుతూనే ఉన్నాయి. అవే అసలు కాంగ్రెస్ పార్టీకి చేటు చేస్తున్నాయి అని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఈ క్రమంలో తాజాగా జరిగిన ఒక సమావేశం మరోమారు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలకు కేంద్ర బిందువుగా మారింది.

కాంగ్రెస్ లో కుమ్ములాటలు

కాంగ్రెస్ లో కుమ్ములాటలు


మొన్నటికి మొన్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఘోర పరాజయం చూసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీనేత‌ల వైఖ‌రిలో పెద్ద‌గా మార్పేమీ రాలేదు . పార్టీలో ఆధిప‌త్య పోరు ఇంకా కొనసాగుతుంది. చీటికీ మాటికీ అలగటం, అధిష్టానానికి ఫిర్యాదులు చెయ్యటం కాంగ్రెస్ పార్టీలో సర్వ సాధారణం విషయాలుగా మారాయి. మ‌రీ ముఖ్యంగా సీనియ‌ర్ల వైఖ‌రిలో అస్స‌లు మార్పులేదు . తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న విధంగా ప్రవర్తిం చే నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పార్టీలో త‌మ‌కు ప్రాధాన్య‌త లేదనీ, కావాల‌నే త‌మ‌ని ప‌క్క‌న‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చెయ్యటం మినహాయించి క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం చెయ్యటానికి కృషి చేసేవారే లేరు.

సహకార ఎన్నికల నేపధ్యంలో ఉత్తమ్ ఇంట్లో నేతల భేటీ

సహకార ఎన్నికల నేపధ్యంలో ఉత్తమ్ ఇంట్లో నేతల భేటీ

ఇక అలాంటి కాంగ్రెస్ పార్టీలో త్వ‌ర‌లో స‌హ‌కార సంఘాల‌కు ఎన్నిక‌లు రాబోతున్న నేపధ్యంలో జరిగిన సమావేశం సీనియర్లకు కోపం తెప్పిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో సహకార ఎన్నికలలో పార్టీ ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న దానిపై భేటీ జ‌రిగింది. క‌నీసం ఈ ఎన్నిక‌ల్లోనైనా పార్టీకి కొంత ఊర‌ట క‌లిగించే ఫ‌లితాల‌ను రాబ‌ట్టాల‌నే వ్యూహంపై పార్టీలోని ఉత్తమ్ వర్గం నేతలు చ‌ర్చించారు. అయితే, ఈ స‌మావేశానికి కొంత‌మంది సీనియ‌ర్ నేత‌ల్ని ఆహ్వానించ‌లేదు. దీంతో వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. కీల‌క‌మైన స‌మావేశాల‌కు త‌మ‌ను పిల‌వ‌క‌పోతే ఎలా అనేది సీనియ‌ర్ల ప్ర‌శ్న‌.

సీనియర్ నేతలను సమావేశానికి పిలవని ఉత్తమ్

సీనియర్ నేతలను సమావేశానికి పిలవని ఉత్తమ్


అయితే, వారిని పిలిస్తే ఎన్నికల కసరత్తు పక్కన పెట్టి విమ‌ర్శ‌లు మాత్ర‌మే చేస్తార‌నీ, సొంత పార్టీ అని చూడకుండా విమర్శించటం తప్ప పైసా పని కూడా చెయ్యటం లేదని , నాయ‌క‌త్వం తీరును త‌ప్పుబ‌డుతూ స‌మావేశం ర‌సాభాస‌గా మారుస్తారనే వారిని పిలవకుండా సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ముందు కూడా వీహెచ్, పొన్నాల లాంటి సీనియ‌ర్ నేత‌లు ఉత్త‌మ్ తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. మున్సిపాలిటీలవారీగా పార్టీ బాధ్య‌త‌లు చూసుకోవాలీ అంటూ కొంద‌రు సీనియ‌ర్ల‌కు బాధ్యతలు అప్పగించిన సమయంలో వారు విమర్శలు చేశారు.

 ఆ నేతలను పిలవని రీజన్ ఇదే .. కాంగ్రెస్ లో అంతే !

ఆ నేతలను పిలవని రీజన్ ఇదే .. కాంగ్రెస్ లో అంతే !

తాము రాష్ట్రస్థాయి నాయ‌కుల‌మ‌నీ, గ‌ల్లీ స్థాయి ప‌నులు చెబుతున్నారంటూ అసంతృప్తి వ్య‌క్తం చేసిన విషయం తెలిసిందే . పార్టీ త‌ర‌ఫున బ‌లంగా ప్ర‌చారం చేయాల్సిన స‌మ‌యంలో వీరి అలకలు, బుజ్జగింపులకే పుణ్యకాలమంతా పోయింది . అదే పున‌రావృతం కావొద్దు అనే ఉద్దేశంతో కొంద‌ర్ని తాత్కాలికంగా దూరం పెట్టామ‌నేది ఉత్త‌మ్ వ‌ర్గం అభిప్రాయ‌ం. కానీ పార్టీ అధ్యక్షుడిగా అందర్నీ కలుపుకుని పని చెయ్యాలి . తమ వర్గానికే ప్రాధాన్యత ఇవ్వటం వల్లే ఇదంతా జరుగుతుంది అనేది సీనియర్ల అభిప్రాయం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కామన్ , ఆ పార్టీ ఎప్పటికీ మారదేమో అనేది ఇదంతా చూస్తున్న జనాల అభిప్రాయం .

English summary
In the wake of the forthcoming election to co operative societies Congress party's, meeting is angering seniors. In Uttam Kumar Reddy's house, the party met to discuss how the party should plan for the elections. However, some senior leaders were not invited for the conference. They are known to be angry on Uttam Kumar Reddy. why they are not invited to key meetings seniors questioned Uttam Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X