హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల వివాదం...ఆపాలంటూ టీపీసీసీ ,ఈసికి లేఖ

|
Google Oneindia TeluguNews

స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల షెడ్యుల్ పై వివాదం మొదలైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఖాలీ అయిన మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సి స్థానాల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే సరైన ఓటర్ల జాబితా లేవని, దీంతో ఎన్నికలను ఆపాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

కొత్త సభ్యులతోనే ఎన్నికలు నిర్వహించాలి : కాంగ్రెస్

కొత్త సభ్యులతోనే ఎన్నికలు నిర్వహించాలి : కాంగ్రెస్

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో సైరైన ఓటరు జాబితా లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రస్థుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త సభ్యులు మే 27వరకు అందుబాటులోకి వస్తారని ఈనేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికలను నిలిపివేయాలని కేంద్రఎన్నికల కమీషన్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికలు సాధ్యం కావని ఉత్తమ్ స్పష్టం చేశారు.ఈసికి ఇచ్చిన లేఖను పరిగణనలోకి తీసుకుని వెంటనే ఎన్నికల ప్రక్రియను నలిపివేయాని అన్నారు. రెండు వారాలు ఎన్నికలు వాయిదా వేసి కొత్తగా ఎన్నికైన ఎంపిటీసీలకు, జెడ్పిటీసీలకు పోలింగ్ లో పాల్గొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈనేపథ్యంలోనే ఓటర్ల జాబితా సిద్దమైన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.

ఎన్నికల సంఘం ఏమంటుంది ? జూలై 5వరకు పదవి కాలం...

ఎన్నికల సంఘం ఏమంటుంది ? జూలై 5వరకు పదవి కాలం...

అయితే రాష్ట్ర్ర ఎన్నికల సంఘం మాత్రం పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని సీఈవో రజత్ కుమార్ చెబుతున్నారు. తమ వద్ద పాత జాబితా ఉందని అంటున్నారు.మరోవైపు స్థానిక సంస్థల సభ్యుల పదవి కాలం జూలై అయిదు వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే కొత్తగా నిర్వహించే ఎన్నికల ఫలితాలను జూన్ 3న ఇస్తామని చెబుతోంది. ఈనేపథ్యంలోనే షెడ్యుల్ సైతం విడుదల చేసింది..

మే 31న ఎమ్మెల్సిల ఎన్నికలు

మే 31న ఎమ్మెల్సిల ఎన్నికలు

ఈ నేఫథ్యంలోనే తెలంగాణలోని మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సి స్థానాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో రంగారెడ్డి , నల్గోండ, వరంగల్ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రజత్ కుమార్ తెలిపారు. కాగా మే 31న పోలింగ్ జరుగుతుండగా మే 14 నామినేషన్లు ధాఖలు చేయనున్నారు. కాగా జూన్ 3 న ఒట్ల లెక్కింపు జరగనుంది. కాగా వరంగల్ ఎమ్మెల్సి కొండా మురలి తన రాజీనామ చేయగా నల్గోండ ,రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సిలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో ఆయా స్థానాల భర్తికి షెడ్యుల్ విడుదల చేసింది ఈసీ.

English summary
Telangana pcc chief uttamkumar reddy wrote a letter to CEC to stop the local body mlc elections immediatly.he alleged that there is no voter list with election commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X