హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంచలన వ్యాఖ్యలతో ఆక్రోశం వెళ్ళగక్కిన వీహెచ్ .. అసలు ఆయన బాధ ఏమిటంటే

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఒక పక్క పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిని కుదేలైనా, పార్టీ ఫిరాయింపుల తో ప్రతిపక్ష హోదాని కోల్పోయినా కాంగ్రెస్ నేతలకు మాత్రం అవేవీ పట్టవు. ఎప్పుడు చూడు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, ఆధిపత్య పోరులో పార్టీకి నష్టం కలిగిస్తుంటారు. అంతేకాదు విపరీతమైన ప్రజాస్వామ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేతలు ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు.

సీపీఐ నేత నారాయణ ఏం చెప్పారు ... ఏపీ సీఎం జగన్ ను పొగుడుతూనే చురకలంటించారు సీపీఐ నేత నారాయణ ఏం చెప్పారు ... ఏపీ సీఎం జగన్ ను పొగుడుతూనే చురకలంటించారు

ఇక తాజాగా ఒకపక్క సీఎల్పీ విలీనంపై బట్టి విక్రమార్క ఆందోళన చేస్తే, ఆమరణ దీక్షకు దిగితే మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు విక్రమార్క దీక్ష పైన కామెంట్ చేయడం సంచలనంగా మారింది. ఇంతకీ ఆ కామెంట్ చేసింది ఎవరో కాదు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంత రావు. మల్లు భట్టి విక్రమార్క దీక్షను అడ్డుపెట్టుకొని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని వి.హనుమంతరావు తీవ్రమైన విమర్శలు చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీతో ఆత్మకు ఏం సంబంధం అంటూ పరోక్షంగా కెవిపి రామచంద్రరావుపై ఆయన విమర్శలు గుప్పించారు. భట్టి విక్రమార్క దీక్షను రాష్ట్ర నేతలు విరమింపజేసి రాహుల్ గాంధీ సూచన మేరకు విరమింప చేశామని చెప్పారని ఆయన మండిపడ్డారు.

V.H hesitated with sensational comments on own party leaders

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, పార్టీ నాయకులు కొందరు వ్యవహరిస్తున్న తీరును రాహుల్ గాంధీకి తెలియజేద్దాం అంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదు మాసాలుగా రాహుల్ గాంధీని కలవాలని ప్రయత్నం చేస్తున్నానని కానీ ఆయన అవకాశం ఇవ్వడంలేదని ఆయన వ్యాఖ్యానించారు. తనకు రాహుల్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే మీడియాకు అన్ని విషయాలను వివరించనున్నట్టుగా వి. హనుమంతరావు తేల్చిచెప్పారు.ఇక కె.వి.పి.రామచంద్రరావు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భట్టీ విక్రమార్క కేవీపీ శిష్యుడా? లేక విహెచ్ శిష్యుడా చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు. ఇక మొత్తానికి ఒకరిమీద ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలతో, అటు టీఆర్ఎస్ పై పోరాటం పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ నేతలే పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేసే పరిస్థితి నెలకొంది.

English summary
Congress Party senior leader V.Hanumatha rao made sensational comments on own party, The former MP and Congress senior leader V. Hanmanta Rao made it clear that some Congress leaders are trying to cover up their mistakes by blocking Vikraamarka's initiative. He also criticized KVP Ramachandra Rao, indirectly saying what is the relationship with the party with the telangana Congress party. He blamed Bhatti Vikramarka's fasting for bringing back the state leaders and saying that Rahul Gandhi had been dropped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X