హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటర్ ఫలితాల రగడ .. కేసీఆర్, కేటీఆర్ లపై మర్డర్ కేసులు పెట్టాలి .. వీహెచ్ సంచలనం

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ. హన్మంతరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ ఇంటర్ ఫలితాల అవకతవకలపైనగానీ, విద్యార్థుల ఆత్మహత్యలపైన గానీ స్పందించలేదని ఆయన మండిపడ్డారు.

ప్రగతి భవన్ చేరిన నిరసనలు .. విద్యార్థుల ఆందోళనలు, అరెస్ట్ లతో ఇంటర్ మంటలుప్రగతి భవన్ చేరిన నిరసనలు .. విద్యార్థుల ఆందోళనలు, అరెస్ట్ లతో ఇంటర్ మంటలు

కేసీఆర్ , కేటీఆర్ లపై మర్డర్ కేసులు పెట్టాలన్న వీహెచ్

కేసీఆర్ , కేటీఆర్ లపై మర్డర్ కేసులు పెట్టాలన్న వీహెచ్

హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వీహెచ్ మాట్లాడారు. తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల్లో అవకతవకల కారణంగా నేటికి 19 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తీవ్రంగా స్పందించారు.ఈ 19 మంది పిల్లలు చనిపోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆరే కారణమని ఆయన ఆరోపించారు. వీరిద్దరిపై వెంటనే మర్డర్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

19 మంది విద్యార్థులు చనిపోయినా కేసీఆర్ , కేటీఆర్ ఎందుకు స్పందించలేదన్న వీహెచ్

19 మంది విద్యార్థులు చనిపోయినా కేసీఆర్ , కేటీఆర్ ఎందుకు స్పందించలేదన్న వీహెచ్

తెలంగాణా రాష్ట్రంలో 19 మంది విద్యార్థులు చనిపోతే, సీఎం కేసీఆర్ ఇంతవరకూ ఎందుకు స్పందించలేదని వీహెచ్ నిలదీశారు. ఈ విషయంలో కేటీఆర్ కూడా స్పందించకపోవడం నిజంగా బాధాకరమన్నారు. దీనికంతటికీ పూర్తి బాధ్యత కేసీఆర్, కేటీఆర్ లాడే అని ఆయన ఆరోపించారు. ఇంత మంది మరణానికి, ఇందరు విద్యార్థులు ఆందోళనకు కారణమైన గ్లోబరీనా ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ సొల్యూషన్స్ సంస్థ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పి నష్టపరిహారం ఇవ్వాలని వీహెచ్ డిమాండ్

కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పి నష్టపరిహారం ఇవ్వాలని వీహెచ్ డిమాండ్

పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన ఆత్మహత్యలకు పాల్పడటం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. విద్యార్థుల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు . ఇప్పటివరకు ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయిన పిల్లల కుటుంబాలకు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలనీ, ఆయా కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

English summary
V. Hanmantharao spoke at a press conference held today in Hyderabad for the suicides of students going on in the intermediate result issue in Telangana. Telangana Congress leader V. Hanumantharao has reacted strongly to the deaths of 19 students today due to irregularities in the Telangana Inter-board Board. He alleged that Chief Minister KCR and his son KTR will be responsible to these 19 children death. he demanded to file immediate murder case on KCR and KTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X