హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేణు కళామతల్లి ముద్దుబిడ్డ.. సినీరంగానికి తీరనిలోటు అని కీర్తించిన కేసీఆర్

|
Google Oneindia TeluguNews

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మృతి చిత్రసీమకు తీరని లోటని అభివర్ణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ మధ్యాహ్నాం మృతిచెందారు. లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోధా ఆస్పత్రిలో చేరారు వేణుమాధవ్. ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూను కన్నుమూశారు. వేణుమాధవ్ మృతితో ఆయన స్వగ్రామం కోదాడలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నవ్వుల జల్లు, హాస్య జరి .. వేణుమాధవ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అతి చిన్న వయస్సులోనే కళామతల్లిని వదిలిపెట్టి .. అభిమానులను దు:ఖసాగరంలో నింపి వెళ్లిపోయాడు. వేణుమాధవ్ మృతిపై ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తన సంతాపం తెలిపారు. వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగిన నటుడు అని కొనియాడారు. వేణుమాధవ్ మృతి సినీ రంగానికి తీరనిలోటని అభిప్రాయపడ్డారు. వేణుమాధవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం కేసీఆర్.

venumadhav dead is Deficit : kcr

మరోవైపు వేణుమాధవ్ స్వస్థలం కోదాడలో విషాదచాయలు అలుముకున్నాయి. తన కామెడీతో నవ్వులు పూయించే మా రాజు లేరనే వార్తను స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. వేణుమాధవ్ మృతి వార్త తెలిసి గ్రామంలో విషాద వదనం నెలకొంది. ప్రతీ ఒక్కరు వేణును తలచుకొని రోదిస్తున్నారు. వేణుమాధవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేణుమాధవ్ దాదాపు 400 పైచిలుకు సినిమాల్లో నటించారు. హాస్యనటుడిగా నటించి .. నవ్వుల పువ్వులు పూయించాడు. తెలుగు సినీ వినిలాకాశంలో నవ్వుల రారాజుగా నిలిచిపోయారు. వేణు మాధవ్ ఇకలేరనే విషయాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

English summary
venumadhav dead is Deficit to cine industry says cm kcr. he is good acter and human being.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X