హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Governor Tamilisai: హైదరాబాదీ మహిళా డాక్టర్ హత్యపై గవర్నర్ తమిళిసై సంచలనం: సర్కార్ కు నోట్.. !

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ కు చెందిన వెటర్నరీ మహిళా డాక్టర్ హత్యోదంతంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. కేసు విచారణలో ఎలాంటి జాప్యం చోటు చేసుకోనివ్వకుండా చూడాలని ఆమె పోలీసు యంత్రాంగాన్ని సూచించినట్లు తెలుస్తోంది. ప్రియాంక రెడ్డి హత్యోదంతం కేసును ఫాస్ట్ ట్రాక్ ద్వారా రోజువారి విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

భయం కలిగేలా..నడిరోడ్డు మీద ఉరి తీయాలి..: చిరంజీవిభయం కలిగేలా..నడిరోడ్డు మీద ఉరి తీయాలి..: చిరంజీవి

జాతీయ మీడియా

జాతీయ మీడియా

దీనిపై ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. తమిళిసై సౌందరరాజన్ శనివారం మహిళా డాక్టర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఓ జాతీయ స్థాయి న్యూస్ ఏజెన్సీతో మాట్లాడినట్లు ఆ జాతీయ మీడియా ఉటంకించింది. ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి, ఈ కేసు విచారణను శరవేగంగా ముగించాలని, త్వరితగతిన బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.


తెలంగాణ ప్రభుత్వం వెంటనే ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని తాను తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఓ నోట్ ను పంపించినట్లు తమిళిసై వెల్లడించినట్లు ఆ జాతీయ మీడియా వెల్లడించింది.

 న్యాయస్థానానికి కేటాయించడం

న్యాయస్థానానికి కేటాయించడం

ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానానికి కేటాయించడం ద్వారా రోజువారీ విచారణను చేపట్టడానికి అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. యావత్ దేశాన్ని ఈ ఘటన కదిలించిందని, దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులకు సత్వర న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని చెప్పారు. బాధితురాలి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్లా కావట్లేదని, ఇంతటి దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

పోలీసు వ్యవస్థలో ఉన్న లోపాలను ఎప్పటికప్పుడు పసిగట్టాలని, వాటిని సవరించుకోవాల్సి ఉందని తమిళిసై అన్నారు. దీనిపైనా తాను కేసీఆర్ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసినట్లు చెప్పారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఇదివరకే చేపట్టిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉందని చెప్పారు. రోజువారీ సమీక్షలను చేపట్టడం ద్వారా పోలీసు వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి అవకాశం ఉంటుందని అన్నారు.

విపత్కర పరిస్థితులు

విపత్కర పరిస్థితులు

ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా వ్యవహరించాలని తాను మహిళలకు సూచిస్తున్నట్లు చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ధైర్య, సాహసాలను ప్రదర్శించాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. వెటర్నరి డాక్టర్ కుటుంబ సభ్యులతో తాను సుమారు అరగంటకు పైగా గడిపానని, వారి నుంచి తనకు పలు సూచనలు, సలహాలు అందాయని అన్నారు. వాటన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి పంపించినట్లు చెప్పారు.

English summary
Telangana Governor Tamilisai Soundararajan on Saturday assured the family of the 25-year-old veterinarian, who was gangraped and killed, that "constitutionally and legally" she would do everything to ensure that they got justice soon with the setting up of a fast-track court and the trial being held on a daily basis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X