హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిక్కుల్లో విజయ్ దేవరకొండ: ప్యాక్ చేసి ప్యాంగ్యాంగ్‌కు పంపాలి - భగ్గుమన్న నెటిజెన్లు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిపోయిన విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డాడు. ప్రజాస్వామ్య పాలన కంటే నియంత పాలనే చాలా మేలంటూ వ్యాఖ్యలు చేసి అన్ని వర్గాల వారినుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఓ ఆన్‌లైన్ చర్చలో పాల్గొన్న విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. విజయ్ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు కూడా స్పందించారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అర్జున్ రెడ్డి

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అర్జున్ రెడ్డి


ఫిల్మ్ కంపానియన్ నిర్వహించిన ఓ ఆన్‌లైన్ చర్చా కార్యక్రమంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై పలు విమర్శలు చేసి వివాదాలు కొని తెచ్చుకున్నాడు. ప్రజాస్వామ్య పాలనకంటే నియంత పాలనే తాను స్వాగతిస్తానంటూ చెప్పి అర్జున్ రెడ్డి చిక్కుల్లో పడ్డాడు. అంతేకాదు ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ఓటు వేయకూడదన్నది తన అభిప్రాయంగా చెప్పుకొచ్చిన దేవరకొండ... నియంతలు జోక్యం చేసుకుని ప్రజలను తమ పాలనపైనే విశ్వాసం ఉంచాలని అలాంటి ఆదేశాలు ఇవ్వాలని దేవరకొండ చెప్పాడు. అంతేకాదు కేవలం మధ్యతరగతి ప్రజలు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులుగా ప్రకటించాలని దేవరకొండ చెప్పి విమర్శపాలయ్యాడు.

సబ్జెక్ట్‌పై అవగాహన లేదన్న నెటిజెన్లు

అయతే ఎన్నికల సమయంలో భారీగా అవినీతి జరుగుతోందని చెప్పేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఉన్నప్పటికీ నెటిజెన్లు మాత్రం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. విజయ్ దేవరకొండకు సబ్జెక్ట్‌పై అవగాహన లేదని చాలామంది నెటిజెన్లు అన్నారు. ఈ సందర్భంగా విజయ్ నటించిన పలు సినిమాల గురించి నెటిజెన్లు ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో తన సినిమాలపై నిషేధం విధిస్తే నిరసన తెలిపేందుకు అన్ని హక్కులు విజయ్‌కు ఉన్నాయి కానీ ఇలా ప్రజాస్వామ్యంను అపహాస్యం చేసేందుకు మాత్రం అతనికి హక్కు లేదని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Recommended Video

Farm Bills : సభలో తీవ్ర కలకలం.. కాంగ్రెస్ పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు! || Oneindia Telugu

ప్యాక్ చేసి ప్యాంగాంగ్‌ పంపాలి


నియంత పాలనే చాలా మంచిదని నమ్మే విజయదేవరకొండ లాంటి వారిని ప్యాక్ చేసి ప్యాంగ్యాంగ్‌లో వదిలేయాలని అన్నారు మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్. వెంటనే వందేభారత్ మిషన్ కింద ఉత్తరకొరియాకు పంపి ఒక నెల అక్కడి జైల్లో ఉంచితే అప్పుడు తెలిసొస్తుందంటూ ట్వీట్ చేశారు పీవీ రమేష్. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ఇలా వివాదాలు కొని తెచ్చుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా తన సినిమా ఫంక్షన్ల సమయంలో కానీ లేదా ఇతర బ్రాండ్ ప్రమోషన్ల సమయంలో కానీ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇక తాజాగా జరిగిన ఆన్‌లైన్ చర్చలో మాట్లాడిన విజయ్ దేవరకొండ... గర్ల్ ఫ్రెండ్స్‌ను లేదా భార్యల చెంపలు చెల్లు మనిపించడంలో తప్పులేదన్నాడు. అది ప్రేమ ఎక్కువై మాత్రమే కొడతారని చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై కూడా నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విటర్‌లో ఈ గోవిందుడికి చుక్కలు చూపారు.

English summary
Vijay Devarakonda once again landed in troubles after he said that Dictatorship is better than democracy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X