హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీలో చేరిన విజయశాంతి .. మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత సొంత గూటికి . కేసీఆర్ , కాంగ్రెస్ లపై ఫైర్

|
Google Oneindia TeluguNews

ఊహించినట్టే కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు సీనియర్ రాజకీయ నాయకురాలు సినీ నటి విజయశాంతి. గత రెండు నెలలుగా విజయశాంతి బీజేపీలో చేరతారన్న వార్తలు ఊపందుకున్నాయి . గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే విజయశాంతి బీజేపీలో చేరి ప్రచారాన్ని నిర్వహిస్తారు అనుకున్నా ఆమె అప్పుడు పార్టీలో చేరలేదు. తాజాగా బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లిన విజయశాంతి , నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఇక నేడు బిజెపిలో చేరి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు విజయశాంతి.

Recommended Video

#Telangana : Congress పార్టీకి షాక్ ఇచ్చి BJP తీర్థం పుచ్చుకున్న Vijayashanti

నేడు సభలో సీఎం కేసీఆర్ దొరగారిని ఒకసారి చూసుకోండన్న విజయశాంతి.. ఎందుకో తెలుసా !!నేడు సభలో సీఎం కేసీఆర్ దొరగారిని ఒకసారి చూసుకోండన్న విజయశాంతి.. ఎందుకో తెలుసా !!

 అరుణ్ సింగ్ సమక్షంలో విజయశాంతి కాషాయ కండువా

అరుణ్ సింగ్ సమక్షంలో విజయశాంతి కాషాయ కండువా

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో విజయశాంతి కాషాయ కండువా కప్పుకున్నారు . బిజెపి జాతీయ నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , లక్ష్మణ్ లు విజయశాంతిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి బిజెపి ప్రయత్నిస్తున్న క్రమంలో, విజయశాంతి తిరిగి సొంత గూటికి చేరుకోవడం పార్టీ శ్రేణులకు ఆనందం కలిగిస్తుంది . సీనియర్ రాజకీయ నాయకురాలు విజయశాంతి మళ్లీ బీజేపీలోకి చేరిన క్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమెను సాదరంగా స్వాగతించారు . ఆనందం వ్యక్తం చేశారు.

 20 ఏళ్ల క్రితం జ్ఞాపకాలను గుర్తు చేసి విజయశాంతిని స్వాగతించిన విద్యా సాగర్ రావు

20 ఏళ్ల క్రితం జ్ఞాపకాలను గుర్తు చేసి విజయశాంతిని స్వాగతించిన విద్యా సాగర్ రావు

ఈ సందర్భంగా ఆయన 20 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను 1998లో విజయశాంతి బీజేపీలో చేరుతున్న సందర్భంగా అద్వానీ నివాసంలో విజయశాంతి, తాను, అద్వానీతో సమావేశమైన ఫొటోను షేర్ చేశారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత బిజెపికి సేవచేయడానికి విజయశాంతి రావటం హర్షణీయమని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు.

ఇక బీజేపీలో చేరిన అనంతరం విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగిందని పేర్కొన్నారు విజయశాంతి.

 కేసీఆర్ ను గద్దె దించుతామని రాములమ్మ సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ ను గద్దె దించుతామని రాములమ్మ సంచలన వ్యాఖ్యలు

కెసిఆర్ ను గద్దె దించుతామని , ఆయన అవినీతిని బయట పెడతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు విజయశాంతి. 1998లో జనవరి 26 వ తేదీన బిజెపి ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని చెప్పిన విజయశాంతి , కొన్ని కారణాల వల్ల పార్టీని వదిలి బయటకు వచ్చానని, తెలంగాణ రాష్ట్రం కోసం చాలా కష్టపడ్డానని చెప్పారు. 2005 మే లో తెలంగాణ లక్ష్యంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడాను అని చెప్పిన ఆమె, కావాలని తన పార్టీని విలీనం చేయాలని కేసీఆర్ తనపై ఒత్తిడి తీసుకువచ్చారని పేర్కొన్నారు.

కెసిఆర్ కంటే ముందే తాను తెలంగాణ కోసం పోరాటం చేశానన్న విజయశాంతి

కెసిఆర్ కంటే ముందే తాను తెలంగాణ కోసం పోరాటం చేశానన్న విజయశాంతి

కెసిఆర్ కంటే ముందే తాను తెలంగాణ కోసం పోరాడుతూ వచ్చానని, కెసిఆర్ కుట్ర పూర్వకంగా తన కుటుంబం మాత్రమే ఉద్యమంలో ఉన్నట్లుగా చిత్రీకరించారని విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణా ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని మాట మార్చాడని , మోసం చేశాడని కేసీఆర్ పై మండిపడ్డారు . టిఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు గెలిచినప్పటికీ ఉద్దేశపూర్వకంగా తనను సస్పెండ్ చేశారని, నేనే పార్టీ నుంచి బయటకు వెళ్లాను అని ప్రచారం చేశారని కెసిఆర్ పై విమర్శల వర్షం కురిపించారు విజయశాంతి.

కాంగ్రెస్ పార్టీపై విజయశాంతి విమర్శలు

కాంగ్రెస్ పార్టీపై విజయశాంతి విమర్శలు

ఇదే సమయంలో రాములమ్మ కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ అసలు సమస్యలపై పోరాటం చేయడం లేదని విజయశాంతి విమర్శించారు. ఏడాది క్రితమే బిజెపిలో చేరాలనుకున్నా అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కు సీఎం కేసీఆర్ స్లో పాయిజన్ ఎక్కించారని, అందుకే సరిగా పనిచేయడం లేదని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ని గద్దె దించడమే తన లక్ష్యమని, పార్టీ ఏ బాధ్యతలు అప్పగించిణా నిర్వర్తిస్తానని, తెలంగాణ ప్రజలు బాగు పడటమే తనకు కావాలని విజయశాంతి పేర్కొన్నారు.

తెలంగాణా రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉందన్న విజయశాంతి

తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడే వాళ్లు ఉండదన్న ఆలోచనతో ఇతర పార్టీల నాయకులు తమ పార్టీలో చేర్చుకున్నారు అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బిజెపి వచ్చిందని, కెసిఆర్ ని గద్దె దించి తీరుతామని రాములమ్మ స్పష్టం చేశారు. ఎక్కడ ఉన్నా కీలకంగానే పని చేస్తానని చెప్పారు.
20 ఏళ్ళ క్రితం బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి ఇప్పుడు మళ్ళీ సొంత గూటికే చేరారు. ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్న క్రమంలో విజయశాంతి చేరటం బీజేపీకి జోష్ ఇచ్చింది .

English summary
Vijayashanti joined in the presence of BJP national general secretary Arun Singh. BJP national leaders, state presidents Bandi Sanjay and Laxman cordially invited Vijayashanti to join the party. As the BJP strives to grow into a strong political force in the state of Telangana, Vijayashanti's return to his home party will bring joy to the party ranks. Former Maharashtra Governor Vidyasagar Rao welcomed senior politician Vijayashanti back to the BJP. After joining the BJP, Vijayashanti fires on KCR .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X