హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెకార్ రాష్ట్ర సమితి..? బీఆర్ఎస్‌పై రాములమ్మ నిప్పులు, మరీ తెలంగాణ

|
Google Oneindia TeluguNews

కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదివరకే వీహెచ్ ఫైర్ కాగా.. ఇప్పుడు విజయశాంతి వంతు వచ్చింది. అధికార టీఆర్ఎస్ పార్టీ పేరు నుంచి "తెలంగాణ"ను తొలగించారని తెలిపారు. పార్టీ పేరు నుంచే తెలంగాణను తొలగించి అసలైన తెలంగాణ ద్రోహి తానేనని నిరూపించుకున్నారని మండిపడ్డారు.

గతంలో టీఆర్ఎస్ పార్టీని గానీ, పార్టీ అధినేత కేసీఆర్‌ని గానీ, ఈ పార్టీ నేతలని గాని ఎవరైనా పల్లెత్తు మాట అంటే చాలు... వారిపై తెలంగాణ ద్రోహి అని ముద్ర వేసి నానా యాగీ చేసేవారని విజయశాంతి గుర్తుచేశారు. ఇప్పుడు కేసీఆర్ ఏకంగా తన పార్టీ పేరు నుంచే తెలంగాణను తొలగించి అసలైన తెలంగాణ ద్రోహి తానేనని నిరూపించుకున్నారు. టీఆర్ఎస్ పేరును మార్చుతూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ నేతలు తప్ప ప్రజల నుంచి ఎంత మాత్రం మద్దతు లేదన్నారు.

 vijayashanti slams on cm kcr for party change issue

కేసీఆర్ చర్యపై సోషల్ మీడియాలో ఆగకుండా వెల్లువెత్తుతున్న మీమ్స్, ట్రోల్సే అందుకు రుజువు అని విజయశాంతి తెలిపారు. టీఆర్ఎస్‌ని పట్టిపీడిస్తున్న లిక్కర్ స్కాం మకిలిని వదిలించుకోలేక... గులాబీ దళం అవినీతిపై కేంద్రం పెట్టిన నిఘా నుంచి తప్పించుకోలేక... బిజెపి సర్కారుతో తలపడేందుకే కేసీఆర్ ఈ బీఆర్ఎస్ బాట పట్టారని అందరికీ అర్థమైందన్నారు.

తెలంగాణ ప్రజలను పీడించిన ఎంఐఎం నాయకత్వంలోని రజాకార్లు కూడా ఇలాగే అప్పటి భారత ప్రభుత్వంతో యుద్ధం అంటూ తుపాకీ రాముడి కబుర్లు చెప్పి తుర్రుమన్న విషయాన్ని కెసిఆర్ గుర్తుంచుకుంటే మంచిదన్నారు. బంగాళాఖాత రాష్ట్ర సమితో, బెకార్ రాష్ట్ర సమితో, బందిపోట్ల రజాకార్ సమితో ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు.

English summary
bjp leader vijayashanti slams on cm kcr for party change issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X