హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విన‌య విధేయ కేటీ రామా..!స‌హ‌చ‌ర ఎమ్మెల్యేల మ‌ద్య ఆస‌క్తికర స‌న్నివేశాలు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : కాలంతో పాటు అభిప్రాయాలు మార‌డంలో త‌ప్పులేదంటాడు ప్ర‌ముఖ త‌త్వ‌వేత్త జిడ్డుక్రిష్ణ మూర్తి. త‌న‌లోని అభిప్రాయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుకుంటూ అంద‌రిని క‌లుపుకుపోతూ కాలంతో ప‌రుగుపెట్ట‌డం అంత‌సులువైన ప‌ని కాదు. నేటి ఉరుకుల ప‌రుగుల యాంత్రిక జీవ‌నంలో ఒత్తిళ్ల‌ను అదిగ‌మించి త‌న‌కు తాను అప్డేట్ అవ్వ‌డం కూడా అంత సులువైన ప‌నేం కాదు. అందుకు ఎంతో నేర్పు, స‌హ‌నం, అవ‌గాహ‌న‌, ఆస‌క్తి ఉండాలంటారు మాన‌సిక వైద్యులు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో క్ష‌ణం తీరిక లేకుండా ఉంటూ అంద‌రిక స‌మ‌న్యాయం చేయాలంటే క‌త్తిమీద సాముచేయ‌డ‌మే. అలాంటి ఒత్తిడిని అదిగ‌మించి అందిరితో క‌ల‌గ‌లుపుగా ముందుకు శ‌భాష్ అనిపించుకుంటున్నారు ఆ తెలంగాణ యువ‌నేత‌..! ఇంత‌కీ ఎవ‌రా నేత‌..? ఏంటా క‌థ‌..? తెలుసుకుందాం..!

కేటీఆర్ ఆటిట్యూడ్ లో మార్పు..! పార్టీకి క‌లిసొస్తుందంటున్న నేత‌లు..!!

కేటీఆర్ ఆటిట్యూడ్ లో మార్పు..! పార్టీకి క‌లిసొస్తుందంటున్న నేత‌లు..!!

తెలంగాణ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు, మంత్రి కల్వ‌కుంట్ల తార‌క‌రామా రావు రాజ‌కీయాల్లో ఎంత చురుగ్గా దూసుకుపోతారో అంతే స్థాయిలో విమ‌ర్శ‌ల‌ను కూడా మూట‌గ‌ట్టుకున్నారు. త‌న ప్ర��వ‌ర్త‌న పెక్యూలియ‌ర్ గా ఉంటుంద‌ని, అంద‌రితో మాట్లాడ‌కుండా సెల‌క్టివ్ గా ఉంటార‌ని, ఏకప‌క్ష నిర్ణ‌యాల‌తో ఎదుటివ‌వారిని గౌర‌వించ‌ర‌ని ఆయ‌న పైన అనేక ఆరోప‌ణ‌లు వినిపిస్తుండేవి. అస‌లు ఆయన వ్య‌క్తిత్వం న‌లుగురిని క‌లుపుకుపోయే విధంగా ఉండ‌ద‌ని, ప్ర‌తివిష‌యంలో అహంకారాన్ని ప్ర‌ద‌ర్శిస్తార‌ని మ‌రో విమ‌ర్శ‌కూడా పార్టీ శ్రేణుల్లో ఉండేది. అందుకే కేటీఆర్ ను క‌ల‌వాలంటే అంత సుముఖ‌త వ్య‌క్తం చేసే వారు క‌ద‌నే చ‌ర్చ కూడా టీఆర్ఎస్ వ‌ర్గాల్లో న‌డుస్తుండేది. కాని అది నిన్న‌ట్టి వ‌ర‌కు. తెలంగాణ లో గులాబీ పార్టీ రెండ‌వ‌సారి అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత, కేటీఆర్ ని పార్టీకి వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ గా చేసిన త‌ర్వాత ఆయ‌న వ్య‌క్తిత్వంలో మార్పు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ప‌రిప‌క్వ‌త చూపిస్తున్న కేటీఆర్..! స్పూర్తి దాయ‌�� ప్ర‌వ‌ర్త‌న‌..!!

ప‌రిప‌క్వ‌త చూపిస్తున్న కేటీఆర్..! స్పూర్తి దాయ‌�� ప్ర‌వ‌ర్త‌న‌..!!

ఒక‌ప్పుడు ముక్కోపి, గ‌ర్విస్టి అని ముద్ర‌వేసుకున్న తెలంగాణ రాష్ట్ర స‌మితి కార్య‌నిర్వాహ‌క అద్య‌క్షుడు క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు ఆ పేరును తుడిచేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పార్టీలో అంద‌రిని క‌లుపుకుపోతూ ప‌రిప‌క్వ‌త చెందిన రాజ‌కీయ నాయ‌కుడిగా అడుగులు వేస్తున్నారు. స‌హ‌చ‌ర ఎమ్మెల్యేల‌ను చిరు మంద‌హాసంతో ప‌ల‌క‌రిస్తూ, అవ‌కాశం ఉన్న అంద‌రికి ��ేక్ హాండ్ ఇస్తూ, ఇంకాస్త స‌న్నిహితుల‌ను బుజం త‌డుతూ అంద‌రితో క‌ల‌గ‌లుపుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు కేటీఆర్. ఇది ఆయ‌న పూర్వ స్వ‌భావానికి పూర్తి విరుద్ద‌మ‌ని కొంత మంది నేత‌లు చెవులు కొరుక్కుంటున్నారు.

తోటి ఎమ్మెల్యేల‌కు ప్రాముఖ్య‌త‌..! బుజం త‌ట్టి ప్రోత్స‌హిస్తున్న యువ‌నేత‌..!

తోటి ఎమ్మెల్యేల‌కు ప్రాముఖ్య‌త‌..! బుజం త‌ట్టి ప్రోత్స‌హిస్తున్న యువ‌నేత‌..!

తెలంగాణ శాస‌న స‌భ‌లో ఎమ్మెల్యేల ప్ర‌మాణ స్వీకార��� సంద‌ర్బంగా గ‌న్ పార్క్ లోని అమ‌ర‌వీరుల స్తూపానికి ముందుగా నివాళులు అర్పించాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు భావించారు. అనుకున్న‌దే అద‌నుగా ఆయ‌న ఎమ్మెల్యేల‌తో క‌లిసి గ‌న్ పార్క్ కు చేరుకున్నారు. ముందు చంద్ర‌శేఖ‌ర్ రావు నివాళులు అర్పించిన త‌ర్వాత ముఖ్య‌నేత‌లు నివాళులు తెలిపారు. త‌ర్వాత ప్ర‌ధాన ద్వారం ద‌గ్గ‌ర వేచి ఉన్న ఎమ్మెల్యేల‌ను ఒక్కొక్క‌రిగా స్వ���యంగా కేటీఆర్ లోప‌ల‌కు పంపించారు. సుమారు 20-30మంది ఎమ్మెల్యేల‌ను గ‌న్ పార్క్ లోకి పంపిన త‌ర్వాత ఆయ‌న నివాళులు అర్పించండం ఎంత‌గానో ముచ్చ‌ట‌గొలిపింది. స‌మ‌జంగా ఐతే కేసీఆర్ తో పాటు ఇద్ద‌రు ముగ్గురు ముఖ్యుల త‌ర్వాత కేటీఆర్ నివాళులు అర్పించే వారు. కాని అలా కాకుండా ఎమ్మెల్యేల త‌ర్వాత అమ‌ర‌వీరుల‌కు నివాళి అర్పించి త‌న నిరాడంబ‌ర‌త‌ను చాటుకున్నారు కేటీఆర్.

మునుప‌టి ప్ర‌వ‌ర్త‌న‌కు తిలోద‌కాలు..! హూందాత‌నం క‌న‌బ‌రుస్తున్న కేటీఆర్..!!

మునుప‌టి ప్ర‌వ‌ర్త‌న‌కు తిలోద‌కాలు..! హూందాత‌నం క‌న‌బ‌రుస్తున్న కేటీఆర్..!!

ఎమ్మెల్యేల ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్బంగా కూడా కేటీఆర్ ఇలాంటి హుందానే ప్ర‌ద‌ర్శించ‌న‌ట్టు తెలుస్తోంది. మొద‌టిసారి ఎమ్మెల్యేలుగా శాస‌న స‌భ‌లో అడుగుపెట్టిన వారు కేటీఆర్ కు క్రుత‌జ్ఞ‌త‌లు తెలిపే క్ర‌మంలో కొంత మంది పాదాభివంద‌నం చేసేందుకు ఉప‌క్ర‌మించ‌గా వారిని అలా చేయొద్ద‌ని కేటీఆర్ వారించిన‌ట్టు తెలుస్తోంది. దీంతో కేటీఆర్ ప్రద‌ర్శించిన హుందాత‌నానికి అక్క‌డున్న స‌హ‌చ‌ర ఎమ్మెల్యేలు ఆయ‌న‌ను మెచ్చుకున్న‌ట్టు తెలుస్తోంది. ఎంత ఎదిగినా అణిగి ఉండ‌డ‌మ‌నే సిద్దాంతానికి లోబ‌డి వ్య‌వ‌హ‌రిస్తున్న కేటీఆర్ వ్య‌వ‌హార‌శైలి సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా మారింది. కేటీఆర్ లో చోటు చేసుకున్న ఈ మార్పు పార్టీకి, పార్టీ శ్రేణుల‌కు క‌లిసివ‌చ్చే ప‌రిణామంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
KTRr's performance has been praised by his fellow MLAs. The KTR became Center of Attraction by his behavior, which has been subjected to the principle of being overpopulated. This change in ktr has been a debate over the party and party cadre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X