హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమిత్ షా తో భేటీ అయిన వివేక్ ... లైన్ క్లియర్ ... కానీ అదే అడ్డు

|
Google Oneindia TeluguNews

పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తారు కానీ ఇప్పుడే కాదట. టీఆర్ఎస్ పార్టీ తనకు టికెట్ కేటాయించకపోవటం తో మనస్తాపం చెందిన ఆయన గులాబీ పార్టీకి రాజీనామా చేశారు . గత ఎన్నికల ముందు సోదరుడైన వినోద్ కు టిక్కెట్ ఇవ్వని నాటినుండి నెలకొన్న వివాదం నేపధ్యంలో పార్టీకి గుడ్ బై చెప్పిన వివేక్ , సోదరుడు వినోద్ తో కలిసి బీజేపీ తీర్ధం పుచ్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది .

Vivek meets Amit Shah ... cleared the line ... but its the hurdle

టీఆర్ఎస్ కు షాక్ .. నేడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న వివేక్ ?టీఆర్ఎస్ కు షాక్ .. నేడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న వివేక్ ?

ఇక తాజాగా వివేక్ బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారని నేడు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవనున్న ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని అంతా భావించారు. అక్కడ అమిత్ షా సమక్షంలోనే వివేక్ బీజేపీలో చేరనున్నారని ఆయనతో పాటు నల్లగొండ జిల్లాకు చెందిన మరికొందరు నేతలు కూడా బీజేపీ లో చేరనున్నారని భావించారు కానీ ఆయన ఈ రోజు పార్టీ లో చేరలేదు .

Vivek meets Amit Shah ... cleared the line ... but its the hurdle

పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ బీజేపీ జాతీయాధ్యక్షుడు నేడు అమిత్ షాని కలిశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నూతన అసెంబ్లీ, సచివాలయం కూల్చివేత నిర్ణయాలపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతోందని కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. సచివాలయ నిర్మాణం విషయంలో తెలంగాణా సర్కార్ చేస్తున్న పనులపై ఆయన కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. అయితే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో పాటు కలిసి అమిత్ షా దగ్గరకు వెళ్లడంతో.. ఇక కాషాయ జెండా కప్పుకోవచ్చునని అంతా భావించారు. కానీ ఆషాడ మాసం ఆయన చేరికకు అడ్డొచ్చింది అని తెలుస్తుంది. ఇది ఆషాఢ మాసం కావటంతో మంచి రోజులు లేవని , అందుకే ఆయన పార్టీ మారలేదని తెలుస్తుంది. ఏది ఏమైనా అమిత్ షా తో భేటీ అయిన వివేక్ ఆయనతో మాట్లాడారు. అయితే వచ్చే నెలలో శ్రావణ మాసం మంచి రోజులు కావటంతో వివేక్ సోదరులు ఇరువురూ బీజేపీ తీర్థం తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది.

English summary
Migration into the Bharatiya Janata Party(BJP) has gained momentum. Former TRS MP Vivek has finally decided to join the BJP. With the invitation from the BJP to join the party, he is ready to join the party, it is learned. According to the reports, Vivek was denied Peddapalli MP ticket in the Lok Sabha election by CM KCR. This has angered him and he resigned TRS. After holding talks with BJP central and state leadership, Vivek has reportedly made up his mind to join BJP tomorrow in the presence of party president Amit Shah.Since it is the month of Ashada masam, there are no good days, so it is evident that he has not changed. Vivek, however, met Amit Shah and spoke to him. However, since the Shravana masam is a good day, both the Vivek brothers are sure to take the BJP Tirtha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X