హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముగ్గురిని కబళించిన మృత్యువు: ప్రమాదంలో గాయపడ్డ చిన్నారి సేఫ్, తెగిన రెండు చేతి వేళ్లు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ హబీబ్‌ నగర్‌లో గోడకూలిన ఘటనలో గాయపడ్డ ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆమె రెండు వేళ్లు మాత్రం తెగిపోయాయి. గోడకూలిన ఘటనలో రోహిణి (6), సారిక (3), నాలుగు నెలల చిన్నారి పావని చనిపోయిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ రెండేళ్ల గీత మాత్రం మృత్యువు అంచుల వరకు వెళ్లి తిరిగొచ్చారు.

హమ్మయ్యా..సేఫ్..

హమ్మయ్యా..సేఫ్..

ప్రమాదం నుంచి చిన్నారి బయటపడిందని ఆమె తండ్రి కే గబ్బర్ తెలిపారు. గురువారం రాత్రి గోడ కూలిన సమయంలో రోహిణి, సారిక, పావనితోపాటు తన కూతుళ్లు ఇంట్లో ఉన్నారని తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ప్రథమ చికిత్స చేసి.. ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. అయితే తన చిన్నకూతురు మాత్రం దేవుని దయ వల్ల ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిందని పేర్కొన్నారు.

కబళించిన మృత్యువు..

కబళించిన మృత్యువు..

హబీబ్‌నగర్ పరిధి అప్టల్‌సాగర్ రహదారి మాన్‌గిరి బస్తీలో ఉంటోన్న మితాయిలాల్ కుటుంబంలో గురువారం రాత్రి గోడకూలిన ఘటన విషాదాన్ని నింపింది. గోడకూలడంతో ఆరేళ్ల రోహిణి, సారిక (3), నాలుగు నెలల పావని అక్కడికక్కడే చనిపోయారు. అమ్మ నాన్న ప్రేమనురాగాలతో చక్కగా సాగిపోతున్న వారి జీవితాన్ని గోడ చీధ్ర చేసింది. గోడ కూలడంతో అక్కాచెల్లెళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలంలోనే చనిపోయారు. చిన్నారుల మృతితో పేరెంట్స్ శోకసంద్రంలో మునిగిపోయారు.

పాత ఇళ్లు కావడంతో..

పాత ఇళ్లు కావడంతో..

గబ్బర్ ఆయన సోదరుడితోపాటు ఇతరుల ఇళ్లు పురాతన కాలానికి చెందినవని స్థానికులు చెప్తున్నారు. 1982లో కొన్ని నిర్మిస్తే.. 1993లో మరికొన్ని కట్టారని పేర్కొన్నారు. చాలా ఇళ్లలో పగులు వచ్చాయని, కొన్ని ఇళ్లలో పై కప్పు పడిపోయాయని చెప్తున్నారు. అయితే ఆ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్తున్నారు. లేదంటే అప్పుడు కూడా ప్రాణ నష్టం జరిగేదని గుర్తుచేసుకొని.. ఆందోళన చెందుతున్నారు.

అప్పుడు బాబు.. ఇప్పుడు కేసీఆర్...

అప్పుడు బాబు.. ఇప్పుడు కేసీఆర్...


2001లో కూడా తమ బస్తీలో ఇళ్లు కూలిపోయాయని.. ఆ సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు సందర్శించారని స్థానికులు గుర్తుచేసుకున్నారు. కానీ ఇప్పటివరకు ఇళ్లు మంజూరు చేయలేదున్నారు. తమకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్ ప్రభుత్వం చెప్పిందని.. కానీ ఇంతవరకు ప్రక్రియ ప్రారంభించలేదని స్థానికులు మండిపడుతున్నారు.

English summary
habibpur wall collapse incident one Survivor out of danger, but losses two fingers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X