హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్‌తో ఏడేళ్లు.. కాంగ్రెస్ నుంచి ఎంపీటీసీగా పోటీ.. ఓటమి భయంతో సూసైడ్..!

|
Google Oneindia TeluguNews

వరంగల్ : రాజకీయాలైనా, ఇంకేదైనా గెలుపోటములు సహజమే. స్పోర్టివ్‌గా తీసుకున్నోళ్లు ముందుకెళతారు. ఓటమి చెందగానే డీలా పడితే వెనకపడిపోతారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వెలుగుచూసిన ఘటన విస్మయం కలిగిస్తోంది. ఎన్నికల బరిలో నిలిచిన ఓ నాయకుడు.. ఓటమి భయంతో ఆత్మహత్యకు ప్రయత్నించడం చర్చానీయాంశమైంది.

మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలోని తాళ్లపూసలపల్లికి చెందిన రాచర్ల రాములు.. కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఎన్నికల ఖర్చుల కోసం అందినకాడికి అప్పులు చేశారు. అదలావుంటే ఫలితాలు రాకముందే అతడిని ఓటమి భయం పట్టుకుంది. ఒకవేళ ఓడిపోతే అప్పులు ఇచ్చినవారి నుంచి వత్తిడి పెరుగుతుందని భావించి సూసైడ్‌కు ప్రయత్నించారు.

నల్గొండలో మరో సైకో శీనుగాడు.. మైనర్ బాలికపై రేప్.. శీలానికి రేటు..!నల్గొండలో మరో సైకో శీనుగాడు.. మైనర్ బాలికపై రేప్.. శీలానికి రేటు..!

warangal district congress mptc candidate suicides due to defeat fear

గెలిచే అవకాశాలు సన్నగిల్లాయనే కారణంతో రాములు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. పురుగుల మందుతో పాటు నిద్రమాత్రలు కూడా తీసుకోవడంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. డాక్టర్లు వైద్యం అందిస్తున్నా కూడా పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

రాములు పరిస్థితి చూసి ఆయన భార్య ఆందోళన చెందుతున్నారు. టీఆర్ఎస్‌లో ఏడేళ్లు పనిచేసినా.. తన భర్తకు తగిన గుర్తింపు దక్కకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీ నేతలు పిలిచి టికెట్ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. అయితే ఎన్నికల్లో పోటీచేయడం ఖర్చుతో కూడుకున్నందున అప్పులు చేసినట్లు తెలిపారు. ఆ నేపథ్యంలో పలువురు సూటిపోటి మాటలు అంటుండటంతోనే తన భర్త ఆత్యహత్య చేసుకున్నట్లు తెలిపారు.

English summary
Warangal District Congress MPTC Candidate Suicides Due To Defeat Fear.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X