హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వావ్.. ఒకేసారి 50 మందితో..!టెక్నాలజీ బాగా మారిపోయింది బాసూ..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం దూసుకెళ్తోంది. అసాద్యం అనుకున్న వన్ని సుసాద్యంగా మారిపోతున్నాయి. ఇక టెక్నాజీ రంగంలో మాత్రం మార్పులు శరవేగంగా జరిగిపోతున్నాయి. అంతే కాకుండా టెక్నాలజీ రంగంలో నెలకొన్న తీవ్ర పోటీ కూడా నూతన సౌలభ్యతల ఏర్పాటుకు దోహదపడుతోంది. అందులో భాగంగా జీవితంలో బాగా పెనవేసుకు పోయిన వాట్సాప్ లో నూతనసౌకర్యాలను పొందుపరిచారు.

ఇప్పటివరకూ వీడియో కాల్ ద్వారా కేవలం నలుగురితో మాత్రమే మాట్లాడగలిగే వాళ్లం. తాజాగా ఒకే సారి యాభై మందితో వీడియో కాల్‌ మాట్లాడే సౌకర్యాన్ని ఆ సంస్థ కనిపెట్టింది. త్వరలోనే ఈ టెక్నాలజీ మనకు అందుబాటులోకి రానుంది. జూమ్ వంటి దిగ్గజ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లను తలదన్నేలా.. ఫేస్ బుక్ తీసుకొచ్చిన మెసెంజర్ రూమ్స్ త్వరలో వాట్సాప్ వెబ్‌లో కనిపించనుంది.

 We Can talk with 50 people at once..!

ఈ వాట్సాప్ మెసెంజర్ రూమ్స్‌లో ఒకేసారి యాభై మందితో మాట్లాడే సౌకర్యం ఉంటుంది. అయితే ఈ మెసెంజర్ రూమ్స్ కోసం ప్రత్యేకంగా ఫేస్‌బుక్ లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో కనిపించేలా ఫేస్ బుక్ యాప్ ను పరిచయం చేస్తోంది. దీంతో వాట్సాప్ నుంచే మెసెంజర్ రూమ్స్ ద్వారా యాభై మందితో వీడియోకాల్ మాట్లొడొచ్చు.

కాగా ఇది జూన్ 2 నుంచి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. వాట్సాప్ గ్రూపు సృష్టించినట్టుగానే మెసెంజర్ రూమ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ విధంగా దాదాపు ఒకే సారి 50 మందితో వీడియో కాలింగ్ మాట్లాడుకునే అవకాశం ఉంది. ఈ వీడియో కాలింగ్ కోసం ఉద్యోగులను, స్నేహితులను, కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వీడియో కాలింగ్ యాప్ అనేది, ఉద్యోగులకు, ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించే స్కూళ్లకు బాగా ఉపయోగపడుతుందని వాట్సాప్ యాజమాన్యం పేర్కొనడం విశేషం.

English summary
WhatsApp has been incorporated into life with new features. So far, they have been able to talk to only four people via video call.The company recently launched a video-call facility with up to fifty people at once. The technology will be available to us soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X