హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెదర్ అప్‌డేట్ : 2,3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పడనున్నాయి. దక్షిణ తెలంగాణలో మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్సుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని చెప్పారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందన్నారు. హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. భాగ్యనగరంలో శనివారం నాడు గరిష్థ ఉష్ణోగ్రత 30 ఉండగా, లో టెంపరేచర్ 17.8 డిగ్రీలుగా రికార్డయింది.

అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పలుచోట్ల వానలు పడే అవకాశముంది. కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు అధికారులు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ ప్రాంతాల్లో దాదాపు తొమ్మిది వందల మీటర్ల ఎత్తున ఉపరితన ఆవర్తనం ఏర్పడింది. మాల్దీవుల నుంచి కోస్తాంధ్ర వరకు.. కోమరిన్ నుంచి తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది.

weather update, unprecedented rainfall in Telugu states

దాంతో పగటి పగటి ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చింది. ఒక డిగ్రీ మేర టెంపరేచర్ తగ్గడంతో వాతావరణం కొంత చల్లబడింది. గాలిలో తేమశాతం పెరిగి రాత్రి సమయంలో చలి అధికమైంది. ద్రోణి అలాగే కొనసాగి మరో మూడు రోజులు వాతావరణంలో ఇలాంటి పరిస్థితే ఉంటుందంటున్నారు అధికారులు.

English summary
There will be unprecedented rainfall in Telugu states. The weather is likely to be a rainy day for three days in south Telangana. In many areas the sky is partially cloudy. It is possible to get moderate rains from light rain. The light rains in Hyderabad are likely to fall. The maximum temperature was 30 degrees on Saturday while the temperatures recorded 17.8 degrees. Even in Andhra Pradesh, there is a possibility to come to the ground. The heavy rains in the coastal and Rayalaseema regions will be heavy, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X