• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వివాహాల రిజిస్ట్రేషన్ మ‌రింత సుల‌భ‌త‌రం..! మీ స్మార్ట్‌ఫోన్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే సౌక‌ర్యం..!

|
  Marriage Registration Now Very Simple | Oneindia Telugu

  హైదరాబాద్ : కొత్త‌గా వివాహం చేసుకోబోయే జంట‌ల‌కు ప్ర‌భుత్వ అదికారులు తీపి క‌బురు వినిపిస్తున్నారు. వివాహాల రిజిస్ట్రేష‌న్ కోసం సంబందిత కార్యాల‌యాల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఇక మీద‌ట ఉండ‌దు. స్మార్ట్ ఫోన్ లోనే వివాహానికి సంబందించిన వివ‌రాల‌ను పొందు ప‌రిచి డౌన్ లోడ్ చేసుకునే సౌక‌ర్యానికి అదికారులు శ్రీకారం చుట్టారు. దీంతో ఎంతో కాలంగా పొంద‌లేని వివాహ రిజిస్ట్రేషన్ స‌ర్టిఫికేట్ ను క్ష‌ణాల్లో పొందొచ్చు. ఇక మీ స్మార్ట్ ఫోన్ యాప్ లో వివ‌రాల‌ను పొందుప‌ర‌చ‌డ‌మే త‌రువాయి స‌ర్టిఫికేట్ మీ ఫోన్ లో ప్ర‌త్య‌క్షం అవుతుంది.

  అన్ని సౌక‌ర్యాలు ఇక మీద‌ట స్మార్ట్ ఫోన్ లోనే..! వివాహ స‌ర్టిఫికేట్లు కూడా..!!

  అన్ని సౌక‌ర్యాలు ఇక మీద‌ట స్మార్ట్ ఫోన్ లోనే..! వివాహ స‌ర్టిఫికేట్లు కూడా..!!

  తెలంగాణ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ప్రజలకు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పలు సదుపాయాలను అందుబాటులోకి తెస్తోంది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీ-రిజిస్ట్రేషన్ పేరుతో ప్రత్యేక యాప్‌ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నది. ఇప్పటికే స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ అధికారులు మ్యారేజ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన యాప్‌ను అధికారికంగా గూగుల్ ప్లేస్టోర్‌లో నిక్షిప్తంచేశారు అదికారులు.

  ఆన్ లైని వివాహాల రిజిస్ట్రేష‌న్ అందుబాటులోకి..! స‌ర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకునే సౌక‌ర్యం..!

  ఆన్ లైని వివాహాల రిజిస్ట్రేష‌న్ అందుబాటులోకి..! స‌ర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకునే సౌక‌ర్యం..!

  అదేవిధంగా చలానాలు, సర్టిఫికెట్ల వివరాలను కూడా కొద్దిరోజుల్లోనే యాప్ రూపంలో అందుబాటులోకి తేనున్నారు. హిందూ వివాహాల చట్టం ప్రకారం జరిగే వివాహాల రిజిస్ట్రేషన్ మరింత పకడ్బందీగా అమలుచేయడానికి ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆన్‌లైన్ ప్రక్రియ ఆశించిన ఫ‌లితాలు ఇస్తున్న నేప‌థ్యంలో గ‌త‌ నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆన్‌లైన్ వివాహాల రిజిస్ట్రేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

  వివాహ రిజిస్ట్రేష‌న్ తో పాటు మ‌రికొన్న యాప్ లు..! త్వ‌ర‌లో అందుబాటులోకి..!

  వివాహ రిజిస్ట్రేష‌న్ తో పాటు మ‌రికొన్న యాప్ లు..! త్వ‌ర‌లో అందుబాటులోకి..!

  వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకొనే దంపతులు ముందుగా స్లాట్ బుక్ చేసుకొని నిర్ణీత సమయానికి సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి సర్టిఫికెట్ పొందవచ్చు. స్థిరాస్తి రిజిస్ట్రేషన్, పాస్‌పోర్ట్ తరహాలోనే ఆన్‌లైన్‌లో ఫొటోలు తీసుకొని పక్కాగా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియను కంప్యూటర్‌లో నిక్షిప్తంచేస్తారు. సంబంధిత వ్యక్తులు ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా సమాచారం తీసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని సర్టిఫికెట్ పొందవచ్చు.

  యాప్ పై అవ‌గాహ‌న కోసం సిబ్బందికి శిక్ష‌ణ‌..! మ‌రి కొద్ది రోజుల్లో మీ ఫోన్ లో ప్ర‌త్య‌క్షం..!!

  యాప్ పై అవ‌గాహ‌న కోసం సిబ్బందికి శిక్ష‌ణ‌..! మ‌రి కొద్ది రోజుల్లో మీ ఫోన్ లో ప్ర‌త్య‌క్షం..!!

  రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఈ యాప్ ప్రయోగం విజయవంతమవడంతో అన్ని జిల్లాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. ఈ యాప్ లో ఇకపై స్టాంపులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడే సమస్త సమాచారాన్ని నిక్షిప్తంచేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కమిషనర్ చిరంజీవులు నిర్ణయించారు. తొలుత చలానాల వివరాలను నిక్షిప్తంచేయనున్నారు. ఈ యాప్ ద్వారా భూముల మార్కెట్ విలువ తెలుసుకోవడం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పొందటం వంటి సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించారు. ఈ యాప్ పనితీరుపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సబ్‌రిజిస్ట్రార్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చి సిద్ధంచేశారు అదికారులు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The couples who are newly married have been offered good news by government officials. No need to circulate around the respective offices for marriages registration. The smart phone has been designed to download and download the details of the wedding registration certificate.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more