హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ పరిశ్రమలు సురక్షితమేనా? విశాఖ తరహా ఘటన జరిగితే పరిస్థితేంటి..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: విశాఖపట్నం వెంకటాపురంలోని ఎల్జీ పాలీమార్స్‌ సంస్థలో గ్యాస్ లీకైన ఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అంటే అవుననే చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా తెలంగాణలోని హైదరబాదు చుట్టూ పలు పరిశ్రమలు ఉండటంతో వాటి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడి పరిశ్రమల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే విశాఖ తరహా ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

కరోనావైరస్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది: ఆ జంతువులపై సక్సెస్, ఈ ఏడాదిలోనే...!కరోనావైరస్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది: ఆ జంతువులపై సక్సెస్, ఈ ఏడాదిలోనే...!

హైదరాబాదు శివార్లలో పరిశ్రమలు

హైదరాబాదు శివార్లలో పరిశ్రమలు


హైదరాబాదు శివార్లలో చాలా వరకు పరిశ్రమలు ఉన్నాయని వీటి నుంచి ప్రమాదం ఎప్పటికైనా పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. హైదరాబాదులో కెమికల్ స్టోరేజ్‌లు ఉన్నాయని చెబుతున్న నిపుణులు ఫార్మాసూటికల్స్ సంస్థల్లో కెమికల్స్ నిల్వ ఉన్నాయని ఇవి పేలుడుకు దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1997లో విశాఖపట్నంలోని హిందుస్తాన్ పెట్రోలియం రిఫైనరీలో ఆరు ఎల్పీజీ ట్యాంకులు పేలడంతో 70 మంది మృతి చెందారు. ఇలాంటి ఎల్పీజీ స్టోరేజీలు హైదరాబాదులోని చర్లపల్లిలో ఉన్నాయి. అప్పుడప్పుడు వార్నింగ్ సిగ్నల్స్ కూడా వస్తుంటాయి. ఇలాంటి ఘటనలు తమిళనాడు, ముంబై, బీహార్‌లలో చోటుచేసుకున్నాయి. సురక్షితమైన చర్యలు తీసుకోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిలువరించగలమని అదొక్కటే మార్గంగా చెబుతున్నారు. ఫ్యాక్టరీలు లేదా పరిశ్రమలు నిబంధనలు ఉల్లంఘిస్తే పరిశ్రమలను మూయించేలా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలా చేయగలిగే దమ్మున్న ఆఫీసర్లు ఎవరున్నారని ప్రశ్నిస్తున్నారు.

 ఔటర్ రింగ్ రోడ్‌‌కు వెలుపల 400 పరిశ్రమలు

ఔటర్ రింగ్ రోడ్‌‌కు వెలుపల 400 పరిశ్రమలు

పరిశ్రమ ఉన్న చోట నుంచి కొంత దూరంలో నివాస గృహాలు ఉంటే ప్రాణాలు దక్కేవని చెప్పడంలో వాస్తవం లేదని మరో నిపుణుడు చెప్పారు. విశాఖ ఎల్జీ పాలీమర్స్ సంస్థ నుంచి గ్యాస్ లీక్ అవడంతో కొండకు ఒకవైపున ఉన్నవారే ప్రమాదం బారిన పడ్డారని కొండకు అవతల వైపున ఉన్న మధురవాడ నివాసితులు క్షేమంగానే ఉన్నారని చెప్పారు. అయితే ఫ్యాక్టరీకి రెండు గ్రామాలు ఒకే దూరంలో ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక తెలంగాణ విషయానికొస్తే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో దాదాపు 400కు పైగా కెమికల్ ఫార్మాసూటికల్స్ మరియు డ్రగ్ మానుఫాక్చరింగ్ పరిశ్రమలున్నాయి. వీటినుంచి గాలి, మట్టి, నీరు కాలుష్యానికి గురవుతున్నాయి. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్‌ ప్రకారం ఓఆర్ఆర్ చుట్టూ 1,125 కాలుష్యం విడుదల చేసే పరిశ్రమలు ఉన్నాయి.

2019 నాచారం అగ్ని ప్రమాదం

2019 నాచారం అగ్ని ప్రమాదం


హైదరాబాదు నగరంలో ఉండి కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవతలకు మారుస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు చాలా సార్లు చెప్పినప్పటికీ అది సాధ్యం కాలేదు. గతేడాది సెప్టెంబర్‌లో నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అలా రెండు నెలల్లోపే రెండు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఫ్యాక్టరీలో ఉన్న ఆరుగురు ప్రాణాలతో బయటపడగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఆ సమయంలో కాలుష్యం విడుదల చేస్తున్న పరిశ్రమలపై సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటామని మంత్రి కేటీఆర్ చెప్పారు. దశల వారీగా ఈ పరిశ్రమలను ఓఆర్ఆర్‌ బయటకు తరలిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా తరలి వెళ్లలేదని సమాచారం.

జయేష్ రంజన్ ఏం చెబుతున్నారు..?

జయేష్ రంజన్ ఏం చెబుతున్నారు..?


ఇక ఇదే విషయమై ఐటీ మరియు పరిశ్రమలు ప్రిన్సిపల్ సెక్రటరీ వివరణ ఇచ్చారు. విశాఖలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాదులో ఉన్న పరిశ్రమల నుంచి ప్రమాద స్థాయి ఏమేరకు ఉందనే నివేదిక తెప్పించుకుంటున్నామని చెప్పారు. గ్రీన్ క్యాటగిరీలో ఉన్న ఇండస్ట్రీస్‌ను ఓఆర్‌ఆర్ వెలుపలకు తరలించడం లేదని జయేష్ రంజన్ చెప్పారు. ప్రమాదకరంగా ఉన్న ఇండస్ట్రీలపై ఆడిటింగ్ ప్రారంభించినట్లు చెప్పారు. ఫైర్ సేఫ్టీ, కాలుష్య నియంత్రణ బోర్డు నుంచి ఐదు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ సంస్థల స్టోరేజీ వ్యవస్థలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని నిర్ధారిస్తారని చెప్పారు.

నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలోనే...

నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలోనే...

నాచారం ముందుగా ఇండస్ట్రియల్ ఏరియా అని ఆ తర్వాత అక్కడ నివాసప్రాంతాలు వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ చాలా వరకు చిన్న తరహా పరిశ్రమలు పనిచేస్తాయి. హైదరాబాదులోని ఇతర ఇండస్ట్రియల్ జోన్లు కూడా ఇలానే ఏర్పడ్డాయి. కటేదాన్‌లోని ఫార్మా సిటీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీల చుట్టూ కూడా నివాస సముదాయాలు వస్తున్నాయి. లాక్‌డౌన్ వేళ పరిశ్రమలు మూతపడటంతో అందులో పనిచేసిన కార్మికుల వెతలు ఎలా ఉన్నాయో చూశామని నిపుణులు చెబుతున్నారు. నగరంలో వారికి ఉద్యోగాలు ఇస్తారు కానీ అయితే నగరంలో నివసించేందుకు మాత్రం సరిపడే జీతాలు మాత్రం ఇవ్వలేకున్నారని చెబుతున్న నిపుణులు ఈ క్రమంలోనే వారంతా పరిశ్రమల పరిసరాల్లో ప్రమాదకరం అని తెలిసినప్పటికీ అక్కడే నివాసం ఉంటున్నారని చెప్పారు.

English summary
The gut-wrenching scenes from the Vizag gas leak on May 7 make one wonder whether the growing industry hub of Telangana- Hyderabad would turn into another Vizag someday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X