హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రశ్నార్థకంలో భవితవ్యం! మళ్లీ అజ్ఞాతంలోకి రాములమ్మ!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Loksabha Election 2019: మళ్లీ అజ్ఞాతంలోకి రాములమ్మ... ప్రశ్నార్థకంలో భవితవ్యం!!

సినిమాల్లోనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లోనూ ఒక వెలుగువెలిగిన ఫైర్ బ్రాండ్ విజయశాంతి. కేసీఆర్ తో విబేధాలతో కాంగ్రెస్ గూటికి చేరిన ఆమె కొంతకాలం యాక్టివ్ గానే కనిపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న ఆమె ఆ తర్వాత మళ్లీ పత్తాలేకుండా పోయారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పజెప్పినా రాములమ్మ మాత్రం అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దేవేందర్‌తో రేవంత్ మంతనాలు ? అందుకోసమేనా ?దేవేందర్‌తో రేవంత్ మంతనాలు ? అందుకోసమేనా ?

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ శాంతి స్టార్ క్యాంపెయినర్. నాలుగేళ్లుగా అజ్ఞాతవాసంలో ఉన్న రాములమ్మ ముందస్తు ఎన్నికల సమయంలో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. టీఆర్ ఎస్ ను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలన్న రాహుల్ గాంధీ ప్రయత్నాలకు తనవంతు సాయం అందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపాలైనా లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తా చూపిస్తానన్న రాములమ్మ ఇప్పుడు మళ్లీ అజ్ఞాతవాసై పోయారు.

ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా నియామకం

ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా నియామకం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించిన విజయశాంతికి లోక్ సభ ఎన్నికల్లో ప్రమోషన్ లభించింది. పార్టీ హైకమాండ్ ఆమెను ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా నియమించింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో విజయశాంతి మరింత క్రియాశీలంగా వ్యవహరిస్తారని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె ప్రచారానికి రావడం లేదు.

మెదక్ టికెట్ ఆశించిన రాములమ్మ

మెదక్ టికెట్ ఆశించిన రాములమ్మ

కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా ఎంపికైన విజయశాంతి నిజానికి మెదక్ ఎంపీ టికెట్ ఆశించారు. అయితే పార్టీ అనిల్ కుమార్ కు ఆ స్థానాన్ని కట్టబెట్టింది. దీంతో ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీనికి తోడు వలసల కారణంగా తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ అవుతుండటంతో విజయశాంతి కూడా పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి బీజేపీ వైపు చూస్తున్నారన్న చర్చ కూడా జోరుగా సాగింది.

రాజకీయ సన్యాసం తీసుకునే యోచన

రాజకీయ సన్యాసం తీసుకునే యోచన

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కు పూర్వవైభవం వచ్చే దాఖలాలు కనుచూపు మేరల్లో కనిపించడం లేదు. అటు బీజేపీలో చేరినా రాజకీయంగా ఆమె లబ్ది పొందే అవకాశాలు అంతత మాత్రమే. పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకుని ఆమె రాజకీయాలకే దూరంగా ఉండాలని భావిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఇదే అభిప్రాయాన్ని వెలిబచ్చిన అప్పట్లో అవసరమైతే సినిమా రంగంపై దృష్టి పెడతానని చెప్పారు.

రాములమ్మ భవిష్యత్ ఏంటి? మళ్లీ సినిమాలవైపు వెళతారా?

రాములమ్మ భవిష్యత్ ఏంటి? మళ్లీ సినిమాలవైపు వెళతారా?

అజ్ఞాతవాసంలో ఉన్న రాములమ్మ రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. ఆమె కాంగ్రెస్ లోనే కొనసాగుతారా లేక మరో పార్టీలో చేరి తన ఉనికి చాటుకుంటారా అన్నది ఎవరికీ సమాధానం దొరకని ప్రశ్నగా మారిపోయింది. ఒకవేళ ఆమె రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటే మళ్లీ సినిమా రంగంపై వైపే వెళ్లే అవకాశాలున్నాయి ఉన్నాయి. తాజాగా మహేష్ బాబు సినిమాలో ఆమె నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఔట్ డేటెడ్ యాక్ట్రెస్ కావడంతో రాములమ్మకు భారీ సినిమా ఆఫర్లు రావడం కూడా అనుమానమే. ఈ నేపథ్యంలో ఆమె తన భవిష్యత్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

English summary
During Telangana election, Vijaya Shanthi was declared as the star campaigner from the Congress party. Vijayashanthi made startling comments against KCR and his son as to how they have ignored Telangana. But none of this worked as TRS clean swept the elections and Vijayashanti is nowhere to be seen. What next for her is the big question in her life right now and seeing at the political situation, Vijayashanthi has nowhere to go.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X