• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బీజేపి తోనే తెలంగాణ కల సాకారం అవుతుంది.!కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ ఉద్ఘాటన.!

|

హైదరాబాద్ : కోటి ఆశలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధోగతి పాలు చేసారని తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపి అధికారంలోకి వస్తేనే తెలంగాణ లక్ష్యంతో నెరవేరాతుందని స్పష్టం చేసారు. హైదరాబాద్ లో జరుగుతున్న కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన బండి సంజయ్ ప్రభుత్య వైఫల్యలపై ద్వజమెత్తరు. సర్వతోముఖాభివృద్దితో దూసుకెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చివేసారని గులాబీ ప్రభుత్వం పై బండి సంజయ్ మండిపడ్డారు.

ఫోటోలు: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం

2023లో బీజేపీదే అధికారం..

2023లో బీజేపీదే అధికారం..

అంతే కాకుండా దేశం కోసం,ధర్మం కోసం ముందుకు వెల్లుతున్నామని, నిబదద్దతతో పనిచేసే కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణ త్యాగలు చేశారని అలాంటి వారి సేవలను బీజేపి ఎన్నటికి మర్చిపోదని బీజేపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. అంతే కాకుండా తెలంగాణ లో 2023 లో అధికారమే పరమావదిగా బీజేపీ లక్ష్యాలను నిర్దేశించుకుంటుందని, గోల్కొండ ఖిల్లా మీద కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని బండి సంజయ్ స్పష్టం చేసారు. పార్లమెంట్ ఎన్నికల్లో సారు, కారు, పదహారు నినాదంతో ముందుకెళ్లిని చంద్రశేఖర్ రావు చివరకు బేజారు అయ్యారని సంజయ్ గుర్తుచేసారు.

భారత్ బయోటెక్ ను సందర్శించిన మోదీ..

భారత్ బయోటెక్ ను సందర్శించిన మోదీ..

కరోన సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు విశ్రాంతి తీసుకుంటుంటే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు బీజేపి కార్యకర్తలు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, చాలా మంది కోవిడ్ రోగులకు ప్రయివేటు ఆసుపత్రుల్లో వైద్యం నిరాకరించడంతో అనేక ఇబ్బంది పడ్డారని, కోవిడ్ వ్యాధిని ఆయుష్మాన్ భారత్ లో చేర్చిన ఘనత కూడా కేంద్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసారు. చంద్రశేఖర్ రావు తప్పని పరిస్థితుల్లో యూటర్న్ తీసుకొని ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని చెపుతున్నారని సంజయ్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి ఫార్మ్ హౌజ్ కు వెళ్లేదారిలో ఉన్న భారత్ బయోటెక్ ను ఇంతవరకు సందర్శించలేదని బండి సంజయ్ మండి పడ్డారు.

ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగింది..

ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగింది..

అంతే కాకుండా లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల రూపంలో దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర జల వనరుల మంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను కేంద్రానికి సమర్పించాలని లేఖ రాసినా ఇంతవరకు స్పందించలేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. ప్రపంచంలో సచివాలయానికి రాని ముఖ్యమంత్రిగా, ఫార్మ్ హౌజ్ కే పరిమితమైన ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారని ఎద్దేవా చేసారు.

అక్రమ కేసులతో భయపడవద్దు..

అక్రమ కేసులతో భయపడవద్దు..

ఇదిలా ఉండగా బీజేపీ కార్యకర్తల పై అక్రమ కేసులు బనాయిస్తూ జైళ్లల్లో పెడుతున్నారని, పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టి బీజేపీని నిరోధించాలని గులాబీ ప్రభుత్వం వ్యూహం రచిస్తోందని, ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు, జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎన్నో ఇబ్బందులు కలిగించినా విజయం సాధించామని కార్యకర్తలు అభినందించారు బండి సంజయ్.రాష్ట్రపార్టీ అధ్యక్షుడుగా పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా ఉంటానని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

English summary
Telangana bjp chief Bandi Sanjay made it clear that if the BJP comes to power, the goal of Telangana will be fulfilled. Addressing in executive meeting in Hyderabad, Bandi Sanjay lashed out at the government's failures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X