• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వామ్మో.. ఎంత పవిత్రమైన ఇల్లాలో..! భర్త పనికి వెళ్లగానే ప్రియుడితో ఇంట్లోనే కాపురం పెట్టేసి భార్య

|

హైదరాబాద్ : భర్త అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని జల్సా చేయాలనుకుంది ఓ ఉత్తమ ఇల్లాలు. భర్త పని కోసం బయటకు వెల్లిపోగానే వెంటనే ఫోన్ చేసి ప్రియుడిని అదే ఇంటికి పిలిపించుకుని కాపురం పెట్టేసేది ఆ ఆదర్శవంతమైన యువతి. కుటుంబ పోషణకై భర్త పనికి వెళ్లి కష్టపడితే...భార్యేమో భర్త వెళ్ళిపోగానే ఇంట్లోనే ప్రియుడితో కులకడం పనిగా పెట్టుకుంది. కాదని పాపం ఏదో ఒక రోజున పండక మానదు కాదా..! ఒక రోజు పని కోసం బయటకు వెళ్లిన భర్త సడన్ గా తిరిగొచ్చేసరికి తన భార్య మరో మగాడితో రాసలీలలు మునిగితేలుతుంది.

ఈ చూడకూడని దృశ్యం భర్త కంటపడడంతో ఆగ్రహనికి లోనై అతడిని కొట్టేందుకు యత్నించగా భార్య ప్రియుడివైపే నిలిచింది. ఇక ఆ వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామానికి చెంది సాయిలుకి మంజుల అనే మహిళతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. కూలి పనులు చేసుకుని జీవించే వీరు గతేడాది హైదరాబాద్‌కు వలస వెళ్లారు. బాలానగర్‌లో నివాసముంటూ బుట్టలు అల్లి అమ్మకునేవారు. ఈ క్రమంలో మంజులకు నల్గొండ జిల్లా డిండి మండలానికి చెందిన మేకల మధుకర్‌రెడ్డితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి తెరదీసింది.

When the husband goes to work, she begans romance with boyfriend at Home..!!

హైదరాబాద్‌లో జీవనం కష్టంగా మారడంతో సాయిలు భార్యను తీసుకుని మళ్లీ స్వగ్రామానికి తిరిగొచ్చేశాడు. అయితే మంజులను విడిచి ఉండలేని మధుకర్‌రెడ్డి కూడా రావిచేడ్‌ గ్రామానికి చేరుకున్నాడు. ఆదివారం సాయిలు ఇంటి నుంచి బయటకు వెళ్లిన సందర్భంలో మంజుల ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంది. భర్త రావడానికి చాలా సమయం ఉందిలే అనుకుని అతడితో రాసలీలల్లో మునిగిపోయింది. ఈలోగా ఇంటికి వచ్చిన సాయిలు వారిద్దరినీ చూసి షాకయ్యాడు.

గొడ్డలి తీసుకుని మధుకర్‌రెడ్డిపై దాడి చేసేందుకు యత్నించగా మంజుల అడ్డుకుంది. భర్త చేతిలోని గొడ్డలి లాక్కుని ప్రియుడి సాయంతో సాయిలుపైనే దాడి చేసింది. వారి బారి నుంచి తప్పించుకున్న సాయిలు స్థానికుల సాయంతో కడ్తాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈలోగా మంజులు, మధుకర్‌రెడ్డి గ్రామం నుంచి పారిపోయారు. పోలీసులు తీవ్రంగా గాయపడిన సాయిలును చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మంజుల, మధుకర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ranga Reddy District Kadthal Mandal is a woman who belongs to Raasanad village and was married a few years ago with a lady named Manjula. They migrated to Hyderabad last year, living in the work of the Wagelabour. Baskets are sold in Balanagar. In this order, Manjula was acquainted with the goat Madhukar Reddy of the Nalgonda district Dindi Mandal and opened to the extramarital relationship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more