హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రో రైలు ట్రాక్ లో పడేదెప్పుడు..? వర్క్ ఫ్రం హోం శరాఘాతం కానుందా..?తర్వాత నిర్ణయం ఏంటి...?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు మళ్లీ పట్టాలెక్కి పరుగులు పెట్టనుందా..? నగనంలో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన హైదరాబాదు మెట్రో రైలు ఊహించని ప్రజాధరణ పొందింది. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు మెట్రో అధికారులు సైతం ఊహించని దానికంటే గొప్పగా విజయవంతమయ్యింది. అయితే మెట్రో మొదలైన తొలి ఏడాదే ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. కరోనా వైరస్ మహమ్మారి వల్ల హైదరాబాదు మెట్రో రైలు పూర్తి స్థాయిలో స్తంభించిపోయింది. లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కూడా మెట్రో రైలు పూర్తి స్థాయిలో పట్టాలెక్కే అంశం పై నీలినీడలు కమ్ముకున్నట్టు తెలుస్తోంది.

ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన మెట్రో.. కానీ అన్నీ అవరోధాలే..

ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన మెట్రో.. కానీ అన్నీ అవరోధాలే..

జనాలతో కిక్కిరిసిపోయిన రైళ్లను, బస్సులను మరో సంవత్సర కాలం వరకూ చూడలేమనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. రైళ్లు, బస్సులు, లోకల్ మెట్లోల్లో ప్రయాణీకులు ప్రయాణం చేసేందుకు సుముఖంగా ఉన్నా అధికారులు అడ్డుకట్ట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిమిత సంఖ్యలో ప్రయాణీకులను అనుమతించడంతో పాటు సీటింగ్ విధానాన్ని పూర్తిగా మర్చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు మెట్రో అధికారులు. స్టాండింగ్ ప్రయాణీకులను పూర్తిగా నిలువరించేందుకు పథకం రచిస్తున్నారు మెట్రో అధికారులు. ఇంత వరకూ బాగానే ఉన్నా సీటింగ్ మార్చే అంశంలో మాత్రం మెట్రో అధికారులు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.

నగరంలో అనూహ్యంగా ప్రజాధరణ పొందిన మెట్రో.. అంతలోనే బ్రేకులు వేసిన కరోనా..

నగరంలో అనూహ్యంగా ప్రజాధరణ పొందిన మెట్రో.. అంతలోనే బ్రేకులు వేసిన కరోనా..

బస్సుల్లో సీటింగ్ విధానం మార్చినంత సులవైన పని మెట్రోలో సాద్యం కాదనే అభిప్రాయాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సామాజిక దూరం పాటించే నూతన ఏర్పాట్లన్నీ చేయడానికి ఆర్థికంగా చాలా ఖర్చవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకోసం ప్రభుత్వం విధించబోయే మార్గదర్శకాలకనుగుణంగా మెట్రో ప్రయాణాన్ని పునరుద్దరిస్తామంటున్నారు అధికారలు. అంతే కాకుండా గతంలో మాదిరిగా అన్ని స్టేషన్లలో మెట్రో నిలుపుదల చేసే అవకాశాల పైన కూడా అధికారులు పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ, ప్రయివేటు రంగ సంస్ధలతో పాటు ఇతర వ్యాపారాలు సజావుగా సాగితేనే మెట్రో రైళ్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలుస్తోంది.

ఆదాయం లేదు.. అంతా ఆర్దిక భారమే అంటున్న అధికారులు..

ఆదాయం లేదు.. అంతా ఆర్దిక భారమే అంటున్న అధికారులు..

అంతే కాకుండా మెట్రో ఉద్యోగుల జీత బత్యాలు కూడా తలక మించిన బారం కాబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు మెట్రోలో ప్రయాణీకుల ఆహ్లాదవాతావరణం కోసం కంపార్ట్ మెంట్లలో జల్లే సుగంధ ద్రవ్యాల ఖర్చుకూడా భారం కాబోతునట్టు అధికారులు చెప్పుకొస్తున్నారు. దీంతో ప్రతి స్టేషన్లలో ఆపితే ఎంత విద్యుత్ అదనంగా కర్చవుతుతందో బేరీజు వేసుకుని స్టేషన్లను కుదించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మెట్రో అధికారులు. కగా ఇవన్ని కూడా ప్రభుత్వ సూచనలు, సలహాల మేరకు మార్పులు చేర్పులు చేయనున్నట్టు అధికారులు దృవీకరిస్తున్నారు.

Recommended Video

Allu Arju Responded David Warner's Ramulo Ramula Song Dance | Oneindia Telugu
కరోనా ప్రభావం మరికొన్ని నెలలు.. ఎప్పటినుండి ప్రారంభమో చెప్పలేని పరిస్థితి..

కరోనా ప్రభావం మరికొన్ని నెలలు.. ఎప్పటినుండి ప్రారంభమో చెప్పలేని పరిస్థితి..

ప్రయాణీకులకు అనుకూలంగా, కరోనా వైరస్ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహిరించినా మెట్రో పట్టాలెక్క డానికి మాత్రం మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రారంభించిన తొలి రోజుల్లోనే మెట్రో రైల్ కు పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చిపడిందనే చర్చ జరుగుతోంది. ఇక మెట్రోలో ఏర్పాటు చేసిన మాల్స్ పరిస్థితి మరీ ఘోరంగా తయాయినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ వల్ల మరో ఏడాది పాటు మాల్స్ వ్యాపారం దారుణంగా పడిపోనుందనే చర్చ జరుగుతోంది. ఇప్పుడిప్పుడే మెట్రో స్టాషన్లలో ఏర్పాటు చేసి మాల్స్ కు అలవాటు పడుతున్న కొనుగోలు దారులను కరోనా కోలుకోని దెబ్బకొట్టినట్టైందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి మెట్రో రైల్ ప్రయాణం ఎప్పుడు అనే అంశం పై మాత్రం ఉత్కంఠ నెలకొన్నట్టు తెలుస్తోంది.

English summary
The Hyderabad Metro train has been completely paralyzed by the coronavirus epidemic. Even after the lockdown restrictions were relaxed, the blue clouds on the Metro train seem to be in full swing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X