హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టెదెవ‌రు..? మంత్రి వర్గ విస్ధరణలో హరీష్ చోటు పై ఉత్కంఠ..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సర్కార్ లో కొన్ని సమాధానం లేని ప్రశ్నలు ప్రజానికాన్ని వేధిస్తున్నాయి. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఎప్పుడు..? ఎప్పుడు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడ‌తారు..? ఇవ‌న్నీ ఇప్పుడు స‌మాధానం లేని ప్ర‌శ్న‌లుగా మిగిలిపోయాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు తెలంగాణ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టినా.. అది కేవ‌లం ఓటాన్ అకౌంట్ మాత్ర‌మే. ఇంకా పూర్తి స్థాయి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టాల్సింది. జులైలోగా బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు బ‌డ్జెట్ స‌మావేశాల‌కు సంబంధించి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. పైగా తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఆర్థిక శాఖ‌కు మంత్రి లేరు. ప్ర‌స్తుతం ఆ శాఖ‌ను సీఎం చంద్రశేఖర్ రావు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను కూడా ఆయ‌నే ప్ర‌వేశ‌పెట్టారు. దీంతో ఆయ‌నే మ‌రోసారి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడ‌తార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికిప్పుడు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగి ఆర్థిక శాఖ కు కొత్త మంత్రి వ‌చ్చే ప‌రిస్థితి కనిపించడం లేదు.

తెలంగాణ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టేది ఎవరు..! కేసీఆర్ దగ్గరే ఉన్న శాఖ..!!

తెలంగాణ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టేది ఎవరు..! కేసీఆర్ దగ్గరే ఉన్న శాఖ..!!

గ‌తేడాది డిసెంబ‌రులో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక చంద్రశేఖర్ రావు పాల‌న‌లో నిదానంగా ముందుకు సాగారు. తొలుత త‌న‌తోపాటు డిప్యూటీ సీఎంగా మ‌హ‌మూద్ అలీతోనే ప్ర‌మాణం చేయించారు. త‌ర్వాత దాదాపు రెండు నెల‌ల‌కు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేసి కొన్ని శాఖ‌ల‌కే మంత్రుల‌ను నియ‌మించారు. అయితే కీల‌క‌మైన ఆర్థిక శాఖకు మాత్రం ఎవ‌రికి ఇవ్వ‌లేదు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు బ‌డ్జెట్ కూడా పూర్తిస్థాయిలో ప్ర‌వేశ‌పెట్టే వీలు లేక‌పోవ‌డంతో కేవ‌లం ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్‌నే తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది.

ఏందయ్యా చంద్రం..! ఏంచేయలేదా కేంద్రం..! ఎందుకైనా మంచిది మోదీతో జర బద్రం..!! ఏందయ్యా చంద్రం..! ఏంచేయలేదా కేంద్రం..! ఎందుకైనా మంచిది మోదీతో జర బద్రం..!!

మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా..! హరీష్ పరిస్తితి ఏంటి..!!

మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా..! హరీష్ పరిస్తితి ఏంటి..!!

అయితే ఆర్థిక శాఖ సీఎం చంద్రశేఖర్ రావు వ‌ద్ద‌నే ఉండ‌టంతో ఆయ‌నే బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. త‌ర్వాత సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఇప్పుడు అవి కూడా ముగిశాయి. ప్ర‌స్తుతం చంద్రశేఖర్ రావు దృష్టంతా ఈ నెల 21న కాళేశ్వ‌రం ప్రారంభంపైనే ఉంది. ఆ త‌ర్వాతే బ‌డ్జెట్‌పై ఒక స్ప‌ష్ట‌తకు వ‌చ్చే వీలుంది. అయితే.. ఈలోపు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేసి కొత్తగా ఆర్థిక శాఖ మంత్రిని నియ‌మిస్తారా.. అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కానీ ఇప్ప‌టికిప్పుడు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేసి కొత్త‌వారికి బాధ్య‌త‌లు అప్పగించే కంటే తానే పూర్తిస్థాయి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం మంచిద‌న్న ఉద్దేశంలో చంద్రశేఖర్ రావు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అరకొరగా మంత్రులు, శాఖలు..! పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేది కేసీఆరేనా..?

అరకొరగా మంత్రులు, శాఖలు..! పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేది కేసీఆరేనా..?

వాస్త‌వానికి ఈసారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో హ‌రీష్‌రావును తీసుకుని ఆయ‌నకు ఆర్థిక శాఖ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. లేదా ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్‌ను శాఖ‌లు మార్చి వాటిని హ‌రీష్‌రావుకు ఇచ్చి.. ఈట‌ల‌కు మ‌రోసారి ఆర్థిక శాఖ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. గ‌త ప్ర‌భుత్వంలోనూ ఆయ‌న ఆర్థిక శాఖ బాధ్య‌త‌లే నిర్వ‌ర్తించారు. అయితే.. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో మ‌రోసారి చంద్రశేఖర్ రావు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది.

కేసీఆర్ అబద్దాల పుట్ట..! కాళేశ్వరం కోసం కేంద్రం ఏం చేసిందో హరీష్ కు తెలుసన్న లక్ష్మణ్..!!

కేసీఆర్ అబద్దాల పుట్ట..! కాళేశ్వరం కోసం కేంద్రం ఏం చేసిందో హరీష్ కు తెలుసన్న లక్ష్మణ్..!!

అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఏర్పాటు కోసమే చంద్రశేఖర్ రావు మంత్రివర్గ సమావేశం నిర్వహించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఆరు నెలల తర్వాత కేబినెట్ భేటీని ఏర్పాటుచేసి, ఎన్నికల హామీలపై కనీసం చర్చించకపోవడం దారుణమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సహకారం అందలేదన్న చంద్రశేఖర్ రావు విమర్శలను లక్ష్మణ్ తిప్పికొట్టారు. కాళేశ్వరం కోసం కేంద్రం ఏమిచేసిందో, కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగిన మాజీ నీటి పారుదల మంత్రి హరీశ్ రావును అడగాలని సూచించారు. హరీశ్ రావు ప్రస్తుతం కనిపించడం లేదనీ, ఆయన ఏమయ్యారని ప్రశ్నించారు. గతంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రశేఖర్ రావు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పట్టించుకోలేదని, చంద్రశేఖర్ రావు ది పదవుల కోసం రాజీపడిన చరిత్రేనని దుయ్యబట్టారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న శాసనసభను మార్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు అవసరం లేదని తేల్చిచెప్పారు.

English summary
When is the ministry expanded? When will the budget be introduced? All this remains an unacceptable problem. The Telangana budget was introduced before the general elections. A full budget has yet to be introduced.The budget is to be approved by July.but there is no finance minister in telangana for the department.cm kcr has to introduce the annual budjet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X