హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గంగిరెద్దుతో పోల్చుతూ ట్రోల్ చేశారు, కానీ, అతడే జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ తొలి విజేత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుకునే దిశగా సాగుతోంది. దీంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. అయితే, ఈ ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం నమోదు చేశారు యూసుఫ్‌గూడ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ పటేల్‌.

 జీహెచ్ఎంసీ ఫలితాల వేళ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ట్వీట్: బీజేపీలో చేరిక ఖాయమే! జీహెచ్ఎంసీ ఫలితాల వేళ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ట్వీట్: బీజేపీలో చేరిక ఖాయమే!

అప్పుడు ట్రోల్ చేశారు..

అప్పుడు ట్రోల్ చేశారు..

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజ్‌కుమార్ పటేల్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతడే టీఆర్ఎస్ పార్టీ తరపున తొలి విజయాన్ని నమోదు చేయడం గమనార్హం. ప్రస్తుతం ట్రోల్ చేసిన ఆ వీడియో మరోసారి వైరల్‌గా మారింది.

ముందుకు రా.. దండం పెట్టు అంటూ కేటీఆర్..

ఎన్నికల ప్రచార సమయంలో యూసుఫ్‌గూడలో మంత్రి కేటీఆర్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్‌కు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ముందుకు రా.. దండం పెట్టుకో.. బాగానే ఉన్నాడు కదా.. వెనక్కి పో' అని అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్‌ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన కూడా అలాగే చేశారు.

గంగిరెద్దుతో పోల్చుటూ టీఆర్ఎస్ అభ్యర్థిని ట్రోల్ చేశారు.. కానీ,

గంగిరెద్దుతో పోల్చుటూ టీఆర్ఎస్ అభ్యర్థిని ట్రోల్ చేశారు.. కానీ,

ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. టీఆర్ఎస్ ప్రత్యర్థులు ఏకంగా మంత్రి కేటీఆర్ తీరును తప్పుడుతూ.. ఓ గంగిరెద్దు వీడియోతో జతచేసి దాన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ అభ్యర్థే ప్రత్యర్థులను ఓడించి విజేతగా నిలవడంతో మరోసారి ఆ వీడియో వార్తల్లోకి ఎక్కింది.

టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ..

టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ..


ఇది ఇలావుండగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ మరోసారి మేయర్ పీఠం దక్కించుకునే దిశగా సాగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఎన్నికల ఫలితాల ప్రకారం.. టీఆర్ఎస్ పార్టీ 42 స్థానాల్లో విజయం సాధించగా, మరో 17 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక బీజేపీ 29 స్థానాల్లో విజయం సాధించగా, మరో 16 స్థానాల్లో ఆధిక్యతను చాటుతోంది. ఎంఐఎం 38 స్థానాల్లో గెలుపొందగా, మరో 4 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో గెలుపొంది సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇక టీడీపీ అడ్రస్ గల్లంతైంది. టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీనే ఇచ్చిందని చెప్పవచ్చు.

Recommended Video

GHMC Results : Uttam Kumar Reddy Resigns As chief Of Telangana Congress

English summary
who trolled by opposition parties, that trs candidate reported first win in yousufguda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X