హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ కుటుంబ సినిమాలు తప్ప... ఇతర సినిమాలు అవసరం లేదా.. ?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో గత కొద్ది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని తెలపడంపై టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ కథా చిత్రం మినహా ఇతర సినిమాలు చూసే అవకాశాన్ని సీఎం కల్పించడం లేదంటూ ఆయన ఎద్దెవా చేశారు.

దాదాపు రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ వేదికగా సాగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల ఖర్చులను తాము భరించలేమని చెప్పడంతో ఈసారి నిర్వహిస్తున్న బాలల చలన చిత్రోత్సవాలు తరలివెళ్లిన విషయం తెలిసిందే..కాగా ప్రభుత్వం నిర్ణయంపై రావుల ఫైర్ అయ్యారు. చిన్నారుల ఆలోచనలకు మరింత ఊతమిచ్చేలా సాగిన వీటీ నిర్వాహాణను అపాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం గత ఆరేళ్లలో ఒక్క అంతర్జాతీయ కార్యక్రమం కూడ నిర్వహించలేదని అన్నారు. కోట్ల రుపాయాలు వెచ్చించి నిర్మించి క్రీడా మైదానాలను పుట్టిన రోజు వేడుకలను నిర్వహించేందుకు ఉపయోగిస్తున్నారని అయన విమర్శించారు.

why not holding the International Children’s Film Festival in Hyderabad :

రెండేళ్లకు ఓసారి జరగే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుకలను కాగా 2003 నుండి హైదరాబాద్‌లోనే శాశ్వతంగా నిర్వహిస్తున్నారు. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడ 2015 మరియు 2017లో కూడ ఘనంగా నిర్వహించారు. కాగా వీటికోసం అంతర్జాతీయంగా పలువురు టెక్నిషిన్లు వివిధ దేశాల మీడియా ఇక్కడకు చేరుకుంటుంది. ఈ వేడుకతో రాష్ట్రానికి కూైడ ప్రయోజనం చేకూరుతోంది. ఈ వేడుకల కోసం కేంద్రం కూడ సహాయం చేస్తోంది. కాని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఖర్చులను భరించలేమంటూ స్పష్టం చేసింది. దీంతో వేడుకులు హైదరాబాద్‌లో రద్దయ్యాయి.

English summary
tdp senior leder crisized ravula chandrasheker reddy for government decision for not holding the 21st International Children’s Film Festival in Hyderabad this year the .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X