హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్ షాకింగ్ :ఈ నగరానికి ఏమైంది? -పోలింగ్ శాతం ఢమాల్ -కారణాలివే -ఖర్చుమాత్రం పెరిగింది

|
Google Oneindia TeluguNews

ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు హోరెత్తించిన ప్రచారం.. బడా నేతల ఆగమనం.. చివరి నిమిషం దాకా చెవులు చిల్లులు పడేలా ప్రసంగం.. మరో వైపు రాత్రికి రాత్రే భారీగా ప్రలోభాలపర్వం.. డబ్బులు పంచుతున్నారంటూ ఒకరిపై మరొకరి దాడుల యవ్వారం.. తీరా అతి కీలకమైన పోలింగ్ రోజున మాత్రం జనం బయటికి రాని వైనం.. వెరసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో మరోసారి ప్రజాస్వామ్యం పురివిప్పి ఆడలేని అదోరకం సందిగ్ధం. అసలీ నగరానికి ఏమైంది? ఓటేయడానికి ఎందుకింత బద్ధకిస్తోంది? వందల కోట్ల ప్రజాధనం ఖర్చవుతోన్న ఓటింగ్ శాతం పెరగకపోవడానికి కారణాలేంటి?

జగన్ పెద్ద ఫేక్ సీఎం -గాలికే పోతాడు -నన్ను చంపేస్తాడా? జీవితంలో తొలిసారి: చంద్రబాబు సంచలనంజగన్ పెద్ద ఫేక్ సీఎం -గాలికే పోతాడు -నన్ను చంపేస్తాడా? జీవితంలో తొలిసారి: చంద్రబాబు సంచలనం

ఇదే హైదరాబాద్ కల్చరా?

ఇదే హైదరాబాద్ కల్చరా?

సాధారణ ఎన్నికలను తలపించేలా జీహెచ్ఎంసీలో పార్టీల ప్రచారం తారాస్థాయిలో జరిగింది. ఈసారి హోరాహోరీ తప్పదని అందరూ అనుకుంటోన్నవేళ ఓటింగ్ శాతం కూడా భారీగా ఉండొచ్చనే విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ 2020 గ్రేటర్ ఎన్నికల్లోనూ గతంలో మాదిరిగా పోలింగ్ శాతం ఢమాల్ అనిపించింది. మధ్యాహ్నం సమయానికి పోలింగ్ 20 శాతం కూడా దాటకపోవడాన్ని బట్టి ఈసారి కూడా ఓటింగ్ 50శాతంలోపే ఉంటుందని ఖాయమైపోయింది. నిజానికి, వలసలకు కేంద్రంగా ఉండే భారత్ లోని మహానగరాల్లో మొదటి నుంచి ఓటింగ్ శాతం తక్కువగానే ఉంటోంది. చివరిసారిగా గ్రేటర్ కు 2016లో ఎన్నికలు జరగ్గా ఓవరాల్ గా పోలింగ్ 45.29 శాతం మాత్రమే నమోదైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 50.86 శాతం, 2019 లోక్ సభ ఎన్నికల్లో 45.51 శాతం పోలింగ్ నమోదైంది. దీన్ని బట్టి హైదరాబాద్ ఓటింగ్ కల్చర్ ఇంతేనా? అని డిసైడ్ కావడానికి ముందు అత్యంత కీలకమైన పాయింట్లను తెలుసుకోవాలి..

కరోనా విలయం: మళ్లీ లాక్ డౌన్? -4న ప్రధాని మోదీ కీలక సమావేశం -అన్ని పార్టీలకు పిలుపుకరోనా విలయం: మళ్లీ లాక్ డౌన్? -4న ప్రధాని మోదీ కీలక సమావేశం -అన్ని పార్టీలకు పిలుపు

వరుస సెలవులు.. వలసదారులు జంప్

వరుస సెలవులు.. వలసదారులు జంప్

సాధారణంగా ఒకే దఫాలో జరిగే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేదీని వారం మధ్యలో ఖరారు చేయడం ఈసీ ఆనవాయితీ. ఈసారి కూడా వారంలో రెండో రోజైన మంగళవారం నాడు గ్రేటర్ పోల్స్ జరిగాయి. అయితే దానికి ముందు నాలుగు రోజులు సెలవులు రావడంతో.. నగరంలో అతిపెద్ద ఓటింగ్ సెక్షన్ గా ఉన్న వసలదారులు సొంతఊళ్ల బాటపట్టారు. శుక్రవారం సాయంత్రం నుంచే పెద్ద సంఖ్యలో జనం ఊళ్లకు వెళ్లిపోయారు. వీకెండ్ (శని, ఆదివారాలు)కు తోడు సోమవారం గురునానక్ జయంతి సందర్భంగానూ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పనిచేయలేదు. మంగళవారం పోలింగ్ సందర్భంగా పబ్లిక్ హాలిడే ఎలాగో ఉంది. గ్రేటర్ పోలింగ్ శాతాన్ని దెబ్బతీసిన మొదటి కారణం వరుస సెలవులైతే..

కరోనా ఎఫెక్ట్.. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్..

కరోనా ఎఫెక్ట్.. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి పోలింగ్ శాతం తగ్గిపోడానికి మరో కారణం కరోనా విలయం అని తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారధి చెప్పారు. సిటీలో వర్కింగ్ సెక్షన్ తోపాటు సీనియర్ సిటిజన్ ఓటర్ల శాతం కూడా తక్కువేమీ కాదు. వైరస్ భయాల కారణంగా 60 ఏళ్లు పైబడినవాళ్లలో చాలా మంది బయటికి రావడానికి సాహసించలేదు. వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పనపై అటు ఈసీగానీ, ఇటు పార్టీలుగానీ పెద్దగా ఫోకస్ పెట్టలేదు. దీనికితోడు, లాక్ డౌన్ కాలంలో మూతబడిన ఆఫీసుల్లో.. ఇంటర్నెట్ ఆధారిత సేవలందిచే సంస్థలేవీ మళ్లీ తెరుచుకోలేదు. ఐటీ, డిజిటల్ రంగాల్లోని కంపెనీలన్నీ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ ఎనీవేర్' సౌకర్యం కల్పించడంతో లక్షలాది మంది టెకీలు ఇప్పటికే ఊళ్లకు వెళ్లిపోయారు. ఇది కూడా గ్రేటర్ లో పోలింగ్ శాతం తగ్గడానికి మరో కారణం..

పోలింగ్ 50 దాటదు.. ఖర్చేమో 100

పోలింగ్ 50 దాటదు.. ఖర్చేమో 100

జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకుగానూ మొత్తం 74లక్షల, 67వేల, 256మంది ఓటర్లున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈసారి భారీ స్థాయిలో 9, 101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామాగ్రి, సిబ్బంది జీతభత్యాలు.. అన్నీ కలుపుకొని ఒక్కో బూత్ కు సరాసరి రూ.60వేలు కేటాయించారు. అంటే, కేవలం పోలింగ్ కోసమే దాదాపు 60 కోట్ల ప్రజాధనం ఖర్చవుతోంది. కౌంటింగ్ ప్రక్రియ కోసం మరో 15 కోట్లు వెచ్చిస్తున్నారు. వెబ్ కాస్టింగ్, పరిశీలకులు, భద్రతా సిబ్బంది తదితర లెక్కలన్నీ కలిపితే గ్రేటర్ ఎన్నికలకు రూ.100 కోట్ల ప్రజాధనం ఖర్చవుతోంది. ఇంతచేసినా.. పోలింగ్ మాత్రం 50 శాతం కూడా దాటడంలేదు. మతవిద్వేషాలు పెరిగిన ప్రస్తుత తరుణంలో శాంతి భద్రతలపై రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ, ఎస్ఈసీ మాత్రం ఓటర్లకు భరోసా ఇస్తున్నారు. సిటీలో చిన్న చిన్న గొడవలు మినహా పెద్దగా పరేషాన్ కావాలసిందేమీ లేదని, సాయంత్రం 6 గంటల గడువులోగా జనమంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.

Recommended Video

GHMC Elections 2020 Polling Update గ్రేటర్ లో పోలింగ్ ప్రక్రియ ఎలా ఉందంటే...!!

English summary
it is clear that in ghmc elections 2020 also voter turnout is very low as previous polls. Despite low turnout, SEC, GHMC spending over Rs 100 crore polls. A large number of voters in GHMC elections have already left for their native places within the state and outside. work from home also effects. during 2016 Hyderabad corporation elections, overall poll percentage was 45.29.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X