హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్త తోడుగా భార్య .. క్రిమినల్ పనుల్లోనూ ... సిటీలో కలకలం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : భార్య .. భర్తతో కడవరకు తోడుంటానని ప్రతీన చేస్తోంది. కష్టంలో, సుఖంలో పాలుపంచుకుంటానని హామీనిస్తోంది. భర్త బాధని తన బాధ అని భావిస్తోంది. ఇంతవరకు ఓకే .. కానీ హైదరాబాద్‌లో విచిత్ర ఘటన జరిగింది. భర్త చేసే క్రిమినల్ పనుల్లోనూ అతనికి తోడుగా నిలిచింది భార్య. అంతేకాదు ఇద్దరూ కలిసి రెండు చేతులా సంపాదిస్తున్నారు.

తోడు .. నీడగా ..
పక్క ఫోటోలు కనిపిస్తున్నది భార్యభర్తలు. వీరికో స్పెషల్ ఉంది. అదే వీరు మాములు కపుల్ కాదు .. నేర స్వభావ పనుల్లోనూ ఒక్కటై పనిచేశారు. యువతను మత్తులో దించే నీచపు పనిలో వీరిద్దరి చేయి చేయి కలిపారు. ఇటీవల పోలీసులు రైడ్ చేయగా భార్యభర్తల బండారం బయటపడింది. వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. ఇద్దరూ కలిసే డ్రగ్స్ విక్రయిస్తారనే కఠోర వాస్తవం పోలీసుల విచారణలో తేలింది. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి ? ఎవరు సరఫరా చేస్తారు ? ప్రాఫిట్ ఎంత ఇస్తున్నారు ? మిగతా డ్రగ్స్ ముఠాలతో సంబంధం ఉందా ? లేక డైరెక్టుగా లింక్ పెట్టుకొని డ్రగ్స్ తీసుకుంటున్నారా అనే అంశాలు విచారణలో తెలుస్తాయని పోలీసులు చెప్తున్నారు.

wife and husband sale druggs

టార్గెట్ ఏంటంటే ?
ఆర్థికంగా బాగున్న పిల్లలే వీరి టార్గెట్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్‌ టార్గెట్‌గా డ్రగ్స్ విక్రయిస్తుంటారని విచారణలో తేలింది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి మత్తు అమ్ముతున్నట్టు సమాచారం. వీరి నుంచి 9 గ్రాముల కొకైన్, కారు, 3 లక్షల నగదు, నాలుగు ఫోన్లు, స్వైపింగ్ మిషన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ చాలా విలువ ఉంటుందని .. వీరి విక్రయాలు కూడా అదేస్థాయిలో ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. స్వైపింగ్ మిషన్లు ఉండడాన్ని బట్టి .. ఆర్థికంగా బాగా ఉన్న యువత డబ్బు తీసుకరాకుండా కార్డులతో లావాదేవీలు చేస్తున్నారని అర్థమవుతుంది. వీరి వెనుక ఏదైనా ముఠా ఉందా అనే కోణంలో కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు.

English summary
There is a specialty for wive and husband. He worked alone in criminal cases. They were taken into custody and the matter was revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X