హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీ మార్పు ప్రచారం గోబెల్స్ కుట్ర.. టీఆర్ఎస్‌ను వీడబోమన్న జూపల్లి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీని వీడబోనన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో పార్టీ మార్పు అంశంపై స్పందించారు. సత్యదూరమైన ప్రచారం జరుగుతుందని .. తాను పార్టీ మారేది లేదని స్పష్టంచేశారు.

అదేం.. లేదే...
తనపై దురదజల్లేందుకు కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జూపల్లి. పూటకో మార్టీ మారే వ్యక్తిని తాను కాదని .. అలా మారే వారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో కొనసాగుతానని స్పష్టంచేశారు. తాను ఎమ్మెల్యేలగా ఓడిపోయిన .. ప్రజలతో ఉంటానని పేర్కొన్నారు. కొల్లాపూర్ అభివృద్ధి కోసం పాటుపడతానని వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయానే తప్ప .. నేతగా కాదన్నారు. నిత్యం కొల్లాపూర్ ప్రజలతో మమేకమవుతానని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి విజయం సాధించారు.

will be continue on trs party.. says jupally

జూపల్లి క‌ృష్ణారావు తెలంగాణ ఉద్యమ సమయంలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పుడు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కొనసాగుతూ.. పదవీకి రాజీనామా చేశారు. కేసీఆర్ వెన్నంటే ఉంటూ .. స్వరాష్ట్రం కోసం పాటుపడ్డారు. తొలి క్యాబినెట్‌లో కీలకమైన పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలను కూడా చేపట్టారు. అయితే 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడంతో .. ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ .. తాను టీఆర్ఎస్‌ను వీడనని స్పష్టంచేశారు.

English summary
Former minister Jupalli Krishnarao will not leave the TRS party. The propaganda that his party is about to change is going on. To this end the party responded on the issue of change
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X