హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

t pcc race:సాగర్ బై పోల్ తర్వాతే.. పార్టీకి నష్టం అంటోన్న ఓ వర్గం.. జోష్ ఉండదని

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ హై కమాండ్ ఏదీ తేల్చుకోలేకపోతోంది. టీ పీసీసీ చీఫ్ ఇప్పుడే నియమించాలా వద్దా అనే అంశంపై ధైర్యం చేసింది. సాగర్ ఉప ఎన్నిక తర్వాతే అంటూ ఇండికేషన్ ఇచ్చింది. అయితే ఇదీ పార్టీకి నష్టం జరుగుతోందా అంటే ఔనని కూడా కొందరు అంటున్నారు. ఇప్పుడు ఉన్న నేతలతో కలిసి ఇటీవల జరిగిన కొన్ని ఎన్నికలను ఉదహరిస్తున్నారు. మళ్లీ ఓడిపోతే కారణం ఏం చెబుతారని కూడా అంటున్నారు.

 వాయిదాల పర్వం..

వాయిదాల పర్వం..

వాస్తవానికి జానా రెడ్డి ప్రవేశంతో టీ పీసీసీ చీఫ్ ఎంపిక వాయిదా పడింది. సాగర్ బై పోల్ ఉన్నందున వద్దని ఆయన చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బలమైన నాయకులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారని హైకమాండ్‌కి చెప్పినట్టు తెలుస్తోంది. జానా రెడ్డి వాదనతో హై కమాండ్ ఏకీభవించింది. కానీ అతని వాదనను కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారు.

 నియమిస్తే ఓకే..

నియమిస్తే ఓకే..

పీసీసీ చీఫ్ నియమించి ఎన్నికలకు వెళితే బాగుంటుందని సూచిస్తున్నారు. కొత్త కార్యవర్గంతో ఎన్నికలకు వెళితే జోష్ ఉంటుందని.. విజయవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. పాత కార్యవర్గంతో పోటీకి దిగితే దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఫలితాలే రిపీట్ అవుతాయని విశ్వసిస్తున్నారు. ఇలా రెండు పక్షాలు.. ఒక్కొక్కరు ఒకలా అంచనా వేస్తున్నారు. కానీ హై కమాండ్ మాత్రం వేచి చూసే ధోరణిలో ఉంది.

 ఇదీ సరికాదు

ఇదీ సరికాదు

టీపీసీసీ రేసులో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఎంపీ రేవంత్‌రెడ్డే కాబోయే చీఫ్‌ అంటూ వార్తలు వచ్చినప్పటికీ.. రేవంత్‌ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొందరు సీనియర్లు అంగీకరించడం లేదని తెలుస్తోంది. ప్రజాకర్షణ, కార్యకర్తల మద్దతు రేవంత్‌కే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మధ్యేమార్గంగా జీవన్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా, రేవంత్‌ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించే యోచనలో హైకమాండ్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో జానారెడ్డి ప్రతిపాదన చేశారు. ఆయన చేసిన వినతి కూడా పార్టీకి మేలు చేసేది కాగా.. హై కమాండ్ వెనక్కి తగ్గింది. కానీ దీనిని కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారు.

English summary
Telangana Congress leaders are also divided over whether the decision can be deferred till the Nagarjuna Sagar bypoll as sought by senior leader K. Jana Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X