హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కీచకులకు కఠిన శిక్షలు, నెలరోజుల్లోపే, ట్వీట్లు కాదు మోడీని కలువు కేటీఆర్..జేజమ్మ..

|
Google Oneindia TeluguNews

మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జేజమ్మ డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కీచకులపై జాలి, దయ చూపొద్దని పేర్కొన్నారు. దిశ హత్య ఘటన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.

బుగ్గనపై చంద్రబాబు సెటైర్లు, ఫండమెంటల్స్ తెలుసా అని ఫైర్, దిశ నిందితులకు ఉరే సరి..బుగ్గనపై చంద్రబాబు సెటైర్లు, ఫండమెంటల్స్ తెలుసా అని ఫైర్, దిశ నిందితులకు ఉరే సరి..

ఉద్యమిస్తేనే..

ఉద్యమిస్తేనే..

ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వంలో కదలికలు వస్తాయని డీకే అరుణ పేర్కొన్నారు. ఉద్యమం నుంచి ప్రభుత్వ విధానంలో మార్పు వస్తుందని తెలిపారు. నిందితులకు త్వరతిగతిన శిక్ష విధించాలని సూచించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు కూడా తీర్పును ఆలస్యం చేస్తున్నాయని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. ఘటన జరిగినా నెలరోజుల్లోనే శిక్షపడేలా చూడాలని కోరారు. దీంతో బాధిత కుటుంబాల్లో ఆత్మస్థైరం పెరుగుతుందన్నారు. అదే సమయంలో నీచానికి ఒడిగట్టేవారిలో కూడా మార్పొస్తుందని చెప్పారు.

ట్వీట్లు కాదు..

ట్వీట్లు కాదు..

పనిలో పనిగా మంత్రి కేటీఆర్‌పై డీకే అరుణ విమర్శలు గుప్పించారు. సమస్యకు సంబంధించి ట్వీట్లు చేయడం కాదని సూచించారు. సమస్యను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ట్వీట్ చేసి చేతులు దులుపుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. ఆర్టీసీ మహిళ కార్మికులకే కాదు.. మహిళలందరికీ రాత్రి సమయాల్లో విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

సమయం లేదా..?

సమయం లేదా..?

దిశ ఘటన జరిగిన ఐదు రోజులకు సీఎం కేసీఆర్ స్పందించారు. హత్యపై కేసీఆర్ రియాక్ట్ కావడం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆదివారం రాత్రి ప్రకటన చేశారు. అయితే గవర్నర్, కేంద్రమంత్రులు.. దిశ కుటుంబసభ్యులను పరామర్శిస్తే.. సీఎం కేసీఆర్‌కు సమయం లేదా అని ప్రశ్నిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

నిరసనలు

నిరసనలు

దిశ ఘటనపై తెలుగురాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. జస్టిస్ దిశ అంటూ పలువురు ప్లకార్డులు పట్టుకొని స్లోగన్స్ చేస్తున్నారు. దిశకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు దిశకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు.

English summary
rape cases with in one month accused will be punished bjp leader dk aruna demand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X