హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్కా, వదిన అంది.. నమ్మకంగా ఉంది.. లక్షలు దోచి పరారైంది

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : నమ్మకంగా ఉంది. చుట్టుపక్కలవారిని అక్కా, వదినా అంటూ ఆప్యాయంగా పలకరించింది. ఆ పిలుపు కొంప ముంచుతుందని వారు గ్రహించలేకపోయారు. మొత్తానికి ఆమె మాయలో పడిపోయారు. ఎంత అడిగితే అంత ఇచ్చారు. చివరకు సదరు మహిళ మోసం చేయడంతో లబోదిబోమంటున్నారు.

మోజు తీర్చుకున్నాడు .. సజీవ దహనం చెయ్యబోయాడు .. వివాహేతర బంధమే కారణంమోజు తీర్చుకున్నాడు .. సజీవ దహనం చెయ్యబోయాడు .. వివాహేతర బంధమే కారణం

వరంగల్ ప్రాంతానికి చెందినట్లుగా చెప్పుకున్న యలమంచిలి స్రవంతి చౌదరి హైదరాబాద్ కు చేరుకుంది. అమీర్ పేట సమీపంలోని బల్కంపేట ప్రాంతంలోని శ్రీ సాయిలక్ష్మి రెసిడెన్సీలో ఫ్లాట్ అద్దెకు తీసుకుంది. అపార్ట్‌మెంట్‌ లోని ఇరుగుపొరుగు వారితో పాటు కాలనీలోని పలువురితో పరిచయాలు పెంచుకుంది. ఓ ప్రముఖ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఉద్యోగం చేస్తున్నానంటూ నమ్మించింది. అలా పలువురు మహిళల దగ్గర దాదాపు 23 లక్షల వరకు అప్పుగా తీసుకుని పరారైంది.

 woman collected lakhs of rupees from neighbours and escaped

వరంగల్ లో ఇల్లు కడుతున్నానంటూ బురిడీ కొట్టించింది స్రవంతి చౌదరి. నిర్మల అనే మహిళ దగ్గర 3 లక్షల రూపాయలు, నూకారత్నం దగ్గర 9 లక్షలు, శ్రీలత దగ్గర ఆరున్నర లక్షలు, భవాని, ఊర్మిళ దగ్గర చెరేసి 2 లక్షలు, మరో ఇద్దరు మహిళల దగ్గర బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు కేసు నమోదైంది. ఈ నెల 10వ తేదీన ఆమె ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సార్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Woman Collected Lakhs of Rupees From Neighbours and Escaped. Incident took place in balkampet, hyderabad. A case filed on sravanthi chowdary who belongs to warangal in SR Nagar Police Station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X