హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొబైల్ తీసుకోబోయి... కిందపడి రెండు ముక్కలయిన యువతి

|
Google Oneindia TeluguNews

సెల్‌ఫోన్ మనిషికి ఎంత నిత్యవసరంగా మారిందో అందరికి తెలిసిందే...దాని అవసరం ఉన్నా.. లేకపోయినా...ఖచ్చితంగా మాత్రం ఫోన్ చేతిలో ఉండాలి..ఈనేపథ్యంలోనే ఫోన్ మాట్లాడే అవసరం ఉన్నా... లేకపోయినా దాన్ని కనీసం చేతిలో పట్టుకోవడం నేటి యువతి యువకులకు ఫ్యాషన్‌గా మారిపోయింది.. అయితే ఆ ఫ్యాషనే యువతి యువకుల ప్రాణాలు తీస్తుంది.. చేతిలో ఉన్న ఫోన్ కోసం అలోచించకుండా అడుగులు వేస్తున్నారు. తాము ప్రయాణంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి ప్రమాదాలకు గురవుతున్నారు.

వివరాల్లోకి వెళితే... సీతాఫల్‌మండి బీదలబస్తీలో నివాసం ఉండే మాధవీ (22) బేగంపేట్‌లోని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రి సమీపంలో ఉన్న ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఉద్యోగం చేస్తోంది. దీంతో రోజు ఎంఎంటీఎస్ ద్వార ఉద్యోగానికి వెళ్లి వస్తుంది. అయితే రోజులాగే కాకుండా బుధవారం కొంత అలస్యంగా బయలుదేరింది. ఇక బేగంపేట్ రైల్వే స్టేషన్‌లో దిగేందుకు సిద్దమయింది..ఇంతలోనే తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ క్రింద పడడంతో కదిలే రైలులోనే ముందుకు వంగింది.. దీంతో ఎలాంటీ పట్టులేకుండా క్రిందకు వంగడంతో ఓక్కసారిగా క్రిందపడింది. దీంతో రెండు ముక్కలుగా శరీరం విడిపోయింది..

woman dead in MMTS at Begumpet

దీంతో ట్రెయిన్‌లో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులు ఓక్కసారిగా హతశులయ్యారు. కాగా మాధవికి కొద్ది రోజుల క్రితం వివాహాం నిశ్చయమైంది. మరో కొద్ది రోజుల్లో వివాహాం చేసేందుకు తల్లి దండ్రులు నిర్ణయించారు. ఇక ప్రింటింగ్ ప్రెస్‌కు రావడం ఆలస్యం కావడంతో తోటి ఉద్యోగురాలు ఫోన్ చేయడంతో అక్కడ ఉన్న ప్రయాణికులు విషయం తెలిపారు.దీంతో హుటాహుటిన తన స్నేహితురాలితోపాటు ప్రింటింగ్ ప్రెస్ యజమాని ప్రమాద స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టమ్ నిమిత్రం తరలించారు..కాగా రోజు తన స్నేహితురాలితో కలిసే వెళ్లే మాధవి ఆరోజు మాత్రం ఆలస్యంగా ఓంటరిగా వెళ్లడంతో ప్రమాదం జరిగిందని తోటి ఉద్యోగులు చెప్పడంతో సంఘటన స్థలం వద్ద విషాదం నెలకొంది.

English summary
Madhavi (22)who is a resident of Sitapalmandi Beedala basti accidentaly death in mmts at Begumpet. when she moves to take the cell phone which is fell in the moving train suddenly skiped.and madavi works at a printing press near Naturecare Hospital in Begumpet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X