హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాదాద్రి వివాదం ... మూలవిరాట్టు లో మార్పులు అవాస్తవం ... జరిగిందిదే !!

|
Google Oneindia TeluguNews

యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మరోవివాదం చోటు చేసుకుంది. మూల విరాట్ విగ్రహంలో మార్పులు చేశారని పలు కథనాలు వచ్చాయి. దీంతో మరోమారు యాదాద్రి ఆలయంపై దుమారం రేగింది. యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించే క్రమంలో ఇప్పటికే పలు మార్లు ఆలయ సంబంధిత విషయాలపై వివాదాలు కొనసాగాయి. తాజాగా మూల విరాట్టును తాకారని, మళ్ళీ చెక్కారని వచ్చిన వార్తలతో ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది .

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ ... యాగానికి స్థల పరిశీలనయాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ ... యాగానికి స్థల పరిశీలన

 యాదాద్రి ఆలయంపై వరుస వివాదాలు

యాదాద్రి ఆలయంపై వరుస వివాదాలు


గతంలో యాదాద్రి శిలలపై కేసీఆర్ , కారు వంటి చిత్రాలను చెక్కటం వివాదం కాగా ఇక దాని నుండి తప్పించుకునేందుకు ప్రభుత్వం అసలు ఆ చిత్రాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం అలా ఏర్పాటు చెయ్యమని చెప్పలేదని చెప్పి, వాటిని తొలగించి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పుడు మూల విరాట్టును కూడా శిల్పులు చెక్కారని స్వామివారికి అపచారం జరిగిందని, పెద్ద ఎత్తున దుమారం లేచింది.

 మూల విరాట్టుపై సింధూరం మాత్రమే తొలగించామని స్పష్టత

మూల విరాట్టుపై సింధూరం మాత్రమే తొలగించామని స్పష్టత

ఈ వ్యవహారంపై వచ్చిన కథనాలపై ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు స్పష్టత ఇచ్చారు. మూల విరాట్‌లో ఎలాంటి మార్పులు జరగలేదని, కేవలం సింధూరం మాత్రమే తొలగించామని చెప్పుకొచ్చారు ప్రధానాచార్యులు నరసింహాచార్యులు. సింధూరం తొలగించడం సహజమైన ప్రక్రియ అని ఆయనన్నారు. అన్ని ఆలయాల్లో మాదిరిగానే ఇక్కడా చేశామని ప్రధాన అర్చకులు తెలిపారు. నిష్టా గరిష్టులైన ఉపాసకులచే సింధూరం తొలగించామని, స్వామివారి నిజరూపంపై ఎలాంటి అపోహలు అవసరం లేదని ఆయన గట్టిగా చెప్పారు.

గర్భాలయంలో అపచారం జరిగిందనే ప్రచారం వాస్తవం కాదు

గర్భాలయంలో అపచారం జరిగిందనే ప్రచారం వాస్తవం కాదు


చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆలయాన్ని ఈ విధంగా అప్రదిష్ట పాలు చేయటం సమంజసం కాదన్నారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా ఆలయ నిర్మాణం జరుగుతుంది. అలాగే గర్భాలయంలోకి అందరినీ అనుమతించలేదు. కేవలం కొందరు ఆచారాలు తెలిసిన శిల్పులను మాత్రమే అనుమతించమని చెప్పారు . వారెవరు స్వామీ వారి మూల విరాట్టును తాకలేదు. కొన్ని దశాబ్దాలుగా స్వామివారి కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నారు.

తెలంగాణాకే తలమానికమైన ఆలయ పునర్నిర్మాణం .. అయినా వివాదాలు

తెలంగాణాకే తలమానికమైన ఆలయ పునర్నిర్మాణం .. అయినా వివాదాలు

కెసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చి ఆలయాన్ని పూర్తిగా పున:నిర్మించడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా రూపొందించాలని నిర్ణయించారు. చినజీయర్ స్వామి వారి ఆశీస్సులతో యాదాద్రి ఆలయ పున:నిర్మాణ క్రతువును ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.ప్రస్తుతం ఆలయ పున:నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా నిర్మాణం జరిగింది .అయినా స్వామి వారి ఆలయం విషయంలో అడుగడుగునా వివాదాలు కొనసాగుతున్నాయి.

స్వయంభూ మూల విగ్రహానికి సింధూరం తొలగింపుతోనే అపోహలు

స్వయంభూ మూల విగ్రహానికి సింధూరం తొలగింపుతోనే అపోహలు

ఈ నేపథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని స్వయంభూ మూల విగ్రహానికి మార్పులు చేశారంటూ కథనాలు ప్రచారం కావటంతో మూల విరాట్ స్వరూపాన్ని అలాగే వుంచామని, సింధూరం తొలగింపుతో స్వామి వారి మీసాలు మాత్రం గోచరిస్తున్నాయని పేర్కొన్నారు . అయితే యాదాద్రి స్వామి వారు శాంత మూర్తా ? లేక ఉగ్రస్వరూపామా? అన్న చర్చ జరుగుతున్న వేళ ఈ అంశంపై క్లారిటీ ఇవ్వలేదు ప్రధాన అర్చకులు.

English summary
Lakshmi Narasimhacharya, the chief priest, has clarified the stories of the re-engraving of original virat in the Yadagiri Gutta Lakshmi Narasimhaswamy Temple. Narasimhacharya claimed that no changes were made in the original Virat and only the sindhoor were removed. As with all temples, the chief priest said they had done so. He strongly asserted that the sindoor was removed by the veda pandits, and that there was no need to speculate rumors on the true nature of the Swami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X