హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్రెండ్‌నే చంపారు.. హైదరాబాద్‌లో దారుణం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : బంధాలు తప్పటడుగులు వేస్తున్నాయి. అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. ఇక దోస్త్ మేరా దోస్త్ అంటూ పాటలు పాడుకున్న స్నేహితులు కూడా అదే కోవలోకి వస్తే ఎలా ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్నేహితులు కుట్రలు పన్నితే ఇంకేమైనా ఉంటుందా. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన మిత్రద్రోహానికి పరాకాష్టలా మిగిలింది. నమ్మిన దోస్తులే చివరకు కాలాంతకులయ్యారు.

ఉప్పల్ పరిధిలోని రామాంతపూర్‌లో దారుణం జరిగింది. నమ్మిన పాపానికి తోటి స్నేహితుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు యువకుడు. కేసీఆర్ నగర్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు ప్రసాద్.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో శవమై కనిపించాడు. అతడి స్నేహితులే కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాల్సిన స్నేహితుల చేతిలో ప్రసాద్ చావడం స్థానికంగా విషాదం నింపింది.

అత్త మీద అల్లుడి పగ.. పోర్న్ సైట్లలో ఆమె నెంబర్.. లైంగిక వేధింపులు తట్టుకోలేక..!అత్త మీద అల్లుడి పగ.. పోర్న్ సైట్లలో ఆమె నెంబర్.. లైంగిక వేధింపులు తట్టుకోలేక..!

young person murdered by friends in uppal hyderabad

ప్రసాద్‌ను చంపిన అనంతరం నిందితులు పరారీలో ఉన్నారు. విషయం తెలిసిన స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. స్నేహితుల మధ్య రగిలిన అంతర్గత కక్షలే ప్రసాద్ హత్యకు దారి తీసి ఉండొచ్చిన అనుమానిస్తున్నారు. ప్రసాద్‌ను హత్య చేసే సమయంలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఉండొచ్చని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

నమ్మిన స్నేహితులే ప్రసాద్‌ను పొట్టనపెట్టుకోవడం అతడి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పొద్దస్తమానం స్నేహితులంటూ వాళ్ల వెంబడి తిరిగే ప్రసాద్ చివరకు వారి చేతిలోనే హతమై కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

English summary
One Young Person Murdered by his friends in Uppal, Hyderabad. Incident took place at 3am in the early hours of sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X