హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఫెన్స్ అకాడమీలో డిష్యూం డిష్యూం, ప్రిన్సిపాల్‌పై యువకుడి దాడి, తమ్ముడి మృతి అని...

|
Google Oneindia TeluguNews

లక్షల్లో ఫీజు వసూల్ చేస్తూ, విద్యార్థులను వేధిస్తున్నారని పేరెంట్స్ డిఫెన్స్ అకాడమీ ఎదుట ఆందోళనకు దిగారు. ఫీజు చెల్లించమని వేధించడంతోనే తన తమ్ముడు పవన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని కార్తీక్ ఆరోపించారు. అకాడమీకి వచ్చిన ఆయన ప్రిన్సిపాల్‌పై దాడి చేశాడు. పవన్ మృతికి ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, సుష్మ మేడం కారణం అని ఆరోపించారు.

స్టూడెంట్ సూసైడ్

స్టూడెంట్ సూసైడ్

హైదర్‌గూడలో డిఫెక్స్ అకాడమీ ఉంది. కోర్సుకు సంబంధించి ఫీజు తీసుకొని.. శిక్షణ ఇస్తుంటారు. అకాడమీ ప్రిన్సిపల్‌గా కృష్ణారెడ్డి ఉన్నారు. అయితే ఇటీవల విద్యార్థి పవన్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బుద్వేల్ రైల్వేస్టేషన్ వద్ద సూసైడ్ చేసుకున్నారు. జేబులో సూసైడ్ నోట్ కూడా లభించింది. అందులో కృష్ణారెడ్డి, సుష్మ మేడం పేర్లు ఉన్నాయి. దీంతో అకాడమీ వేధింపులతోనే పవన్ కుమార్ సూసైడ్ చేసుకున్నారని కుటుంబసభ్యులు చెప్తున్నారు.

ప్రిన్సిపల్‌పై దాడి

ప్రిన్సిపల్‌పై దాడి

అకాడమీ తీరుతో రగిలిపోయిన పవన్ కుమార్ సోదరుడు కార్తీక్ ప్రిన్సిపల్ క్యాబిన్‌లోకి వచ్చాడు. దీంతో వారి మధ్య మాటా మాటా పెరిగింది. ఫీజు కట్టమని వేధించావని మొదలైన గొడవ ఘర్షణకు దారితీసింది. కోపోద్రిక్తుడైన కార్తీక్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డిపై దాడి చేశాడు. తన తమ్ముడి మృతికి కారణం అని వాదించాడు. దాడి చేసే సమయంలోనే అతన్ని పట్టుకున్నాడు. ఘటనను మొత్తం వీడియో తీశారు. తనపై దాడి చేయొద్దని, మాట్లాడాలని ప్రిన్సిపల్ కోరాడు.

 తమ్ముడిని తీసుకొస్తావా..

తమ్ముడిని తీసుకొస్తావా..

చనిపోయిన తన తమ్ముడిని తిరిగి తీసుకొస్తారా అని కార్తీక్ అన్నారు. ఫీజు కోసం వేధించారని.. ఆ విషయం తమకు చెప్పలేక చనిపోయాడని పేర్కొన్నారు. కానీ అకాడమీ స్టాఫ్ మాత్రం తాము వేధించలేదని, అతని ఆత్మహత్యకు సంబంధం లేదని చెబుతోంది. ఈ ఘటనపై ఇరు వర్గాల నుంచి ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు కాలేదు.

English summary
karthik attack by hyderabad defence academy principal krishna reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X