• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వాట్సాప్ వద్దు, ఫోన్ చేయొద్దు.. ప్రేమించిన యువతి నిరాకరించడంతో..!

|

హైదరాబాద్ : క్షణికావేశంలో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రేమించిన యువతి కాదందని.. మనసు పడ్డోడు దూరమవుతున్నాడని.. ఇలా రకరకాల కారణాలతో ప్రాణాలు తీసుకునే వరకు వెళుతోంది వ్యవహారం. చిన్న చిన్న మనస్పర్థలతో ప్రేమ జంటలు గూడు చెదిరిన పక్షుల్లా మారుతున్నారు. అదే కోవలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడం చర్చానీయాంశమైంది. అయితే తాను ప్రేమించిన అమ్మాయి కారణంగా చనిపోయాడా.. హత్యనా లేదంటే ఆత్మహత్యనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 ప్రేమ వ్యవహారం.. యువకుడు అనుమానస్పద మృతి..!

ప్రేమ వ్యవహారం.. యువకుడు అనుమానస్పద మృతి..!

హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మురళి అనే వ్యక్తి ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి నాలుగైదు ఏళ్ల కిందట బాలాపూర్ ఏరియాలోని జిల్లెలగూడకు వచ్చి నివాసముంటున్నారు. ఆ క్రమంలో మురళి కుమారుడు 30 సంవత్సరాల సందీప్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అయితే శనివారం నాడు రాత్రి 11 -12 గంటల వరకు ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఉన్న సందీప్ అర్ధరాత్రి దాటాక అనుమానస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. అయితే రాత్రి తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లాడేమోనని కుటుంబ సభ్యులు భావించారు. కానీ మరునాడు ఆదివారం తెల్లవారుజామున ఇరుగుపొరుగు సందీప్ మృతదేహం చూసి మురళి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

వాట్సాప్ వద్దందని.. ఫోన్ చేయొద్దందని..!

వాట్సాప్ వద్దందని.. ఫోన్ చేయొద్దందని..!

మెడికల్ రిప్‌గా పనిచేస్తున్న సందీప్ కొన్నాళ్ల నుంచి కూకట్‌పల్లికి చెందిన ఓ యువతితో ప్రేమలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. అయితే రెండు కుటుంబాల పెద్దలకు విషయం కాస్తా తెలియడంతో వద్దని వారించినట్లు సమాచారం. అదే క్రమంలో ఆ యువతి కూడా సందీప్ ప్రేమను తిరస్కరించడంతో అతడు మనస్థాపం చెందినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు శనివారం అర్ధరాత్రి దాకా కూడా వారి మధ్య వాట్సాప్ ఛాటింగ్ కూడా జరిగిందని.. అదే క్రమంలో ఫోన్ చేసి మాట్లాడుతానంటూ కోరగా ఆమె నిరాకరించిందట. అంతేకాదు ఇకపై తనకు ఎప్పుడూ ఫోన్ చేయొద్దని సదరు యువతి సూచించిందట.

దర్యాప్తు ముమ్మరం.!

దర్యాప్తు ముమ్మరం.!

ప్రేమించిన యువతి తనను కాదందనే నేపథ్యంలో సందీప్ విగతజీవిగా కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ క్రమంలో అతడు మూడవ అంతస్తు నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదలావుంటే సదరు యువతి ప్రేమ వ్యవహారంలో సందీప్‌ను ఆమె తరపు బంధువులు చంపేశారా అనే కోణంలోనూ అనుమానాలున్నాయి. సందీప్‌ను చంపేసి మృతదేహాన్ని అతడి ఇంటి ఎదుట పడేసి వెళ్లిపోయారా అనేది మరో కోణంగా కనిపిస్తోంది.

సందీప్ అనుమానస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే సందీప్ హత్యకు గురయ్యాడా లేదంటే ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనేది తేలాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ అసలు విషయం బయటపడేటట్లు లేదు. ఆ క్రమంలో సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Young people are taking lives at the moment. The death of a young man from Hyderabad was debated in the same vein. But he died because of the girl he loved .. There are suspicions of murder or suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more