హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ షర్మిల: జగన్ బాణం కాదు కేసీఆర్ బాణం, రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

|
Google Oneindia TeluguNews

వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఒక్కొ నేత స్పందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విశ్లేషణ చేస్తున్నారు. కానీ షర్మిల పార్టీ వెనక సీఎం కేసీఆర్ ఉన్నారనే కొత్త వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. ఆయన అండతోనే షర్మిల పార్టీ ఆవిర్భావంపై ఆలోచన చేశారని అంటున్నారు. షర్మిల పార్టీ పెడతారని ఊహాగానాల నెలకొన్న తరుణంలో ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ కొత్త పార్టీ గురించి ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. షర్మిలకు ఐడియా ఇచ్చేసి.. మీడియాతో మాట్లాడారా అనే అనుమానాలు వస్తున్నాయి.

వైఎస్ షర్మిల కొత్త పార్టీ: అభిమానులతో భేటీతో ప్రాధాన్యం, గోనె ప్రకాశ్ హాట్ కామెంట్స్వైఎస్ షర్మిల కొత్త పార్టీ: అభిమానులతో భేటీతో ప్రాధాన్యం, గోనె ప్రకాశ్ హాట్ కామెంట్స్

కేసీఆర్ బాణమే..

కేసీఆర్ బాణమే..

వైఎస్ షర్మిల కొత్త పార్టీపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి స్పందించారు. షర్మిల జగనన్న వదిలిన బాణం కాదని ఆయన అన్నారు. కేసీఆర్‌ మళ్లీ సీఎం కారు అని.. అందుకోసం కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీయడానికి పన్నాగం పన్నారని పేర్కొన్నారు. షర్మిల.. కేసీఆర్‌ వదిలిన బాణం అని అన్నారు. ప్రపంచ నలుమూలలా వైఎస్‌ అభిమానులు ఉన్నారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.

తెలంగాణ బిడ్డలే..

తెలంగాణ బిడ్డలే..

కాంగ్రెస్‌ సీఎంగా వైఎస్‌ఆర్ జనరంజక పాలన అందించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ జగన్/ షర్మిలపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రం తెచ్చుకుంది తెలంగాణ బిడ్డలు రాజ్యం ఏలాలని నొక్కి వక్కానించారు. రాజన్నబిడ్డలు రాజ్యం ఏలాలని కాదని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. కృష్ణా జలాలపై షర్మిల వైఖరి తెలియజేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ తర్వాతే పార్టీ పేరుతో ప్రజల్లోకి రావాలని కోరారు.

దూరం దూరంగా షర్మిల

దూరం దూరంగా షర్మిల


గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారం చేపట్టింది. కానీ షర్మిలకు పదవీ రాలేదు. ఎమ్మెల్యే సీటు లేదు. రాజ్యసభ ఊసే లేదు. పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. ఇక తన దారి తాను చూసుకోవాలని అనుకుంటున్నారు. ఆ మేరకు కొత్త పార్టీ ఏర్పాటు గురించి ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వాస్తవానికి తెలంగాణలో కూడా ప్రతిపక్ష పార్టీ లేకుండా పోయింది. సీఎల్పీని కూడా టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ, ఇతరులు కూడా ప్రభుత్వాన్ని ఎదురించే పరిస్థితి లేదు. షర్మిల పార్టీ ఇప్పుడు పురుడు పోసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి ప్రభావం చూపించే అవకాశం ఉంది.

English summary
YS sharmila is kcr Arrow not jagan mohan reddy congress mp Revanth reddy said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X