• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

IPL 2021: బిగ్ షాక్: స్టార్ స్పిన్నర్‌కు ఏమైంది: మెగా టోర్నీకి అశ్విన్ గుడ్‌బై: అర్ధాంతరంగా

|

చెన్నై: రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని పరిణామం ఇది. స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. అర్ధాంతరంగా ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నాడు. ఇంటికి బయలుదేరి వెళ్లనున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో అతను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీలో కలకలం చెలరేగింది. అశ్విన్‌కు ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది.

ఢిల్లీ కేపిటల్స్ తరఫున..

ఢిల్లీ కేపిటల్స్ తరఫున..

రవిచంద్రన్ అశ్విన్.. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ కేపిటల్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. ఒత్తిడికి గురవుతున్నాడు. ఇప్పటిదాకా అయిదు మ్యాచ్‌లను ఆడిన అశ్విన్.. తీసుకున్నది ఒకే ఒక్క వికెట్. ధారాళంగా పరుగులను సమర్పించుకుంటున్నాడు. అశ్విన్ తన ఫామ్‌ను కోల్పోయాడనేది ఇక్కడ స్పష్టమౌతోంది. ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. శ్రమిస్తున్నాడు. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ వికెట్లను పడగొట్టలేకపోయాడతను. తన నాలుగు ఓవర్ల కోటాలో 27 పరుగులు ఇచ్చాడు.

హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక..

హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక..

రవిచంద్రన్ అశ్విన్ ఇంత హఠాత్తుగా.. అర్ధాంతరంగా ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌ నుంచి వైదొలగడానికి కారణాలు లేకపోలేదు. ఈ నిర్ణయం వెనుక అతను కుటుంబం ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబానికి అండగా ఉండాలనే ఒకే ఒక్క కారణంతో అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పుట్టుకొస్తోన్నవిషయం తెలిసిందే. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంతో గడపాలనే కారణంతో అశ్విన్ ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకొన్నాడు. అశ్విన్ కుటుంబం చెన్నైలో నివసిస్తోంది.

ఇప్పటికే ఇద్దరు..

ఇప్పటికే ఇద్దరు..

వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే ఇద్దరు క్రికెటర్లు ఐపీఎల్ 2021 సీజన్ నుంచి ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. అశ్విన్ మూడో ప్లేయర్. ఇంతకుముందు- రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్, ఆస్ట్రేలియన్ అండ్రూ టై అర్ధాంతరంగా ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. తన స్వదేశానికి వెళ్లిపోయాడు. అదే జట్టుకు చెందిన మరో క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టోన్ సైతం తన స్వదేశం ఇంగ్లాండ్‌కు తిరుగుముఖం పట్టాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బయో బబుల్ సెక్యూర్ వ్యవస్థలో మార్పులు చేసిన కారణంగా అతను స్వదేశానికి వెళ్లాల్సి వచ్చింది. బ్రిటన్ ప్రభుత్వం భారత్‌ను రెడ్‌లిస్ట్‌లో చేర్చడం వల్లే లివింగ్‌స్టోన్ స్వదేశానికి వెళ్లాడని సమాచారం.

అదే బాటలొ ఇద్దరు ఆసీస్ క్రికెటర్లు..

అదే బాటలొ ఇద్దరు ఆసీస్ క్రికెటర్లు..

వేర్వేరు జట్ల తరఫున ఆడుతోన్న మరో ఇద్దరు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు కూడా స్వదేశానికి వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయమే వారు తమ టీమ్ మేనేజ్‌మెంట్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు స్పోర్ట్స్ వెబ్‌సైట్స్ వెల్లడించాయి. రవాణాపరమైన ఇబ్బందులేవీ లేకపోతే.. ఆ ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా వైదొలగే అవకాశాలు లేకపోలేదు. ఆస్ట్రేలియా ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలను కఠినతరం చేసినందు వల్ల వారు వెనుదిరగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశీ ఆటగాళ్లతో పాటు అశ్విన్ సైతం టోర్నీకి దూరం కావడం ఆందోళనకు గురి చేస్తోంది.

English summary
Spinner Ravichandran Ashwin has cut short his IPL season with the Delhi Capitals to be with family as India grapples with a particularly overwhelming second wave of the Covid-19 pandemic. Ashwin tweeted the news on Sunday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X