India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ20 ప్రపంచకప్‌-2021పై పాకిస్తాన్ కడుపుమంట: బీసీసీఐపై తీవ్ర ఆరోపణలు: ఆడనివ్వకుండా కుట్ర

|
Google Oneindia TeluguNews

దుబాయ్: పొరుగు దేశం పాకిస్తాన్.. భారత్‌పై తనకు ఉన్న అక్కసును మరోసారి వెల్లబోసుకుంది. భారత్‌తో దౌత్య సంబంధాల మాట ఎలా ఉన్నా.. కనీసం క్రీడారంగంలోనైనా సత్సంబంధాలను కొనసాగించడానికి ఏ మాత్రం సుముఖంగా లేదనే విషయాన్ని మరోసారి బయటపెట్టుకుంది. తన దేశానికి ప్రపంచకప్‌ను అందించిన పాకిస్తాన్ జాతీయ జట్టు మాజీ కేప్టెన్ ఇమ్రాన్ ఖాన్.. స్వయంగా ప్రధానమంత్రిగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ క్రీడల్లోనూ శతృత్వాన్ని కొనసాగించడానికే ఆ దేశం మొగ్గు చూపుతోందనేది ఈ తాజా ఉదంతంతో రుజువైంది.

తుస్సు మంటోన్న యంగ్ గన్స్: ఉడుకు నెత్తురు అప్పుడే చల్లారిందా: ఆ త్రయంపై డౌట్స్: ఉన్నట్టుండి తుస్సు మంటోన్న యంగ్ గన్స్: ఉడుకు నెత్తురు అప్పుడే చల్లారిందా: ఆ త్రయంపై డౌట్స్: ఉన్నట్టుండి

 భారత్‌లో టీ20 ప్రపంచకప్..

భారత్‌లో టీ20 ప్రపంచకప్..

టీ20 ప్రపంకప్ మెగా టోర్నమెంట్‌ను అడ్డుగా పెట్టుకుని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సరికొత్త కుట్రకు తెర తీసినట్టు కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్‌కు ఈ సారి భారత్ ఆతిథ్యాన్ని ఇస్తోన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ టోర్నమెంట్‌ను షెడ్యూల్ చేశారు. మార్చి లేదా ఏప్రిల్‌లో టీ20 ఫార్మట్‌లో ప్రపంచకప్ ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దీన్ని నిర్వహించబోతోంది. ఐసీసీ గుర్తింపు ఉన్న దేశాలు ఇందులో పాల్గొనబోతున్నాయి. ఇందులో పాకిస్తాన్ ఒకటి.

పాకిస్తాన్ వాదన ఏంటీ?

పాకిస్తాన్ వాదన ఏంటీ?

భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభం కాబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీ) ఉద్దేశపూరకంగా ఇబ్బందులను సృష్టిస్తోందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆరోపిస్తోంది. తమ జట్టుకు విసాలను మంజూరు చేయడానికి వెనుకాడుతోందనే విమర్శలను గుప్పిస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి వసీం ఖాన్ ఓ ప్రకటన చేశారు. తమ క్రికెటర్లను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. భారత్‌లో నిర్వహించ తలపెట్టిన ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టోర్నీలో పాల్గొనడానికి ఇద్దరు పాకిస్తాన్ షూటర్లకు విసాలను మంజూరు చేయకపోవడాన్ని ఆయన ఉదహరించారు.

 ఐసీసీ ఏం చెబుతోంది?

ఐసీసీ ఏం చెబుతోంది?

వసీం ఖాన్ చేస్తోన్న ఆరోపణలను ఐసీసీ తోసిపుచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పింది. బీసీసీఐ ఒప్పందాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా.. టీ20 ప్రపంచకప్‌లో ఆడే అర్హత పొందిన అన్ని దేశాల క్రికెట్ జట్లకు విసాల ప్రక్రియను చేపడుతామని అన్నారు. ఇందులో ఏ ఒక్క దేశాన్ని కూడా మినహాయించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమాచారాన్ని ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు పంపించామని ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా పాకిస్తాన్ క్రికెటర్లకు విసాలను మంజూరు చేస్తామని చెప్పారు.

English summary
ICC 2021 T20 WC: Pakistan Cricket Board (PCB) CEO Wasim Khan's effort to provoke controversy by calling for visa assurance from International Cricket Council (ICC) for the 2021 T20 World Cup in India hasn't found many takers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X