• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేనే కోహ్లీని అయితే టీట్వంటీ వరల్డ్ కప్‌కు కుల్దీప్ చాహల్‌ను ఎంపిక చేయను: పనేసర్

|

లండన్: భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత గడ్డపై ఈ మెగాటోర్నీ జరుగుతుండటంతో స్పిన్నర్లు కీలకం కానున్నారని తెలిపాడు. అయితే తానే టీమిండియా కెప్టెన్ అయితే మాత్రం టీ20 వరల్డ్ కప్ జట్టులోకి యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లను అస్సలు తీసుకోనని స్పష్టం చేశాడు. సీనియర్ స్పిన్నర్లు అయిన రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకే అవకాశం ఇస్తానని తెలిపాడు. చాహల్-కుల్దీప్ కంటే జడేజా-అశ్విన్‌లను తీసుకోవడమే భారత్‌కు ఉత్తమమని, ఈ ఇద్దరు ఆల్‌రౌండర్లనే విషయం మర్చిపోవద్దన్నాడు.

అయితే గతకొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. 10 మ్యాచ్‌ల్లో యూజీ 9 వికెట్లే తీయగా.. కుల్దీప్ కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే అవకాశం దక్కించుకొని ప్రభావం చూపలేకపోయాడు. ఈ క్రమంలోనే టీమ్‌మేనేజ్‌మెంట్ అశ్విన్-జడేజాలకు మరో అవకాశం ఇవ్వాలని మాంటీ పనేసర్ సూచించాడు. వారి అనుభవం, గేమ్ చేజింగ్ సామర్థ్యం జట్టుకు ఉపయోగపడుతుందని తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

If I was Virat iwould pic Ashwin-Jadeja duo for the T-20 World Cup:Monty Panesar

ఇక చాహల్, కుల్దీప్‌కు ఈ సీజన్ ఐపీఎల్‌ అగ్ని పరీక్షలాంటిదని పనేసర్ అభిప్రాయపడ్డాడు. 'చాహల్, కుల్దీప్ యాదవ్‌లకు ఈ సీజన్ లిట్మస్ టెస్ట్ లాంటిది. ఈ సీజన్‌లో గనుక విఫలమైతే వారి టీ20 ప్రపంచకప్ బెర్త్‌లపై సందేహాలు నెలకొంటాయి. అక్టోబర్‌లో జరిగే ఈ మెగాటోర్నీ కోసం విరాట్ కోహ్లీ బెస్ట్ స్పిన్నర్లను తీసుకుంటాడు. వారు ఎవరనే విషయంతో సంబంధం లేకుండా ఎంపిక చేస్తాడు. అతనికి సత్తా చాటే స్పిన్నర్లు కావాలి. ఇప్పటికే అతనికి కావాల్సిన పేసర్లు, ఆల్‌రౌండర్లు, బ్యాట్స్‌మెన్ ఉన్నారు. కానీ స్పిన్నర్ల విభాగమే అతన్ని కలవరపెడుతోంది.

నేనే టీమిండియా కెప్టెన్ అయితే మాత్రం కుల్దీప్-చాహల్‌కు బదులు అశ్విన్-జడేజాను టీ20 వరల్డ్‌కప్‌టీమ్‌కు ఎంపిక చేస్తాను. ఎందుకంటే వారి అనుభవం, గేమ్ చేజింగ్ సామర్థ్యం జట్టుకు ఉపయోగపడుతుంది. ఈ ఇద్దరూ ఆల్‌రౌండర్లు. బిగ్ మ్యాచ్ ప్లేయర్స్. అలాంటి ఆటగాళ్లను వరుసగా విఫలమవుతున్న కుల్దీప్-చాహల్ ప్లేస్‌లో ఎందుకు ఎంపిక చేయకూడదు? 'అని మాంటీ పనేసర్ ప్రశ్నించాడు. ఇక వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ కూడా టీమిండియాలోకి పునరాగమనం చేసే అవకాశం ఉందని పనేసర్ చెప్పుకొచ్చాడు.

ఈ సీజన్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున బరిలోకి దిగిన అతను అద్భుత ప్రదర్శన కనబరిస్తే టీమిండియా జట్టులోకి వచ్చే చాన్స్ ఉందని పనేసర్ అభిప్రాయపడ్డాడు.'ఈ ఐపీఎల్ భారత స్పిన్నర్ల సత్తాకు పరీక్ష. ఈ జాబితాలో హర్భజన్ సింగ్‌ను ఏమాత్రం అంచనా వేయకూడదు. ఐపీఎల్ సీజన్‌లో అదరగొడితే అతన్నెందుకు టీ20 ప్రపంచకప్ టీమ్‌లోకి తీసుకోరు? నాకు తెలిసి అతనిలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఈ సీజన్‌లో అదరగొడితే అశ్విన్, జడేజాలతో పాటు భజ్జీకి టీ20 వరల్డ్‌కప్ టీమ్‌కు ఎంపికయ్యే అవకాశాలున్నాయి.'అని పనేసర్ చెప్పుకొచ్చాడు.

English summary
Monty Panesar says If I was Virat, I would pick Ashwin-Jadeja ahead of Kuldeep-Chahal for the T20 World Cup.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X