India
  • search
  • Live TV
నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తొలి సంతకం నోటిఫికేషన్లపైనే.. మద్దతు ధర కల్పిస్తాం: షర్మిల

|
Google Oneindia TeluguNews

సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణం సీఎం కేసీఆర్ అని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. ఇన్నేళ్లుగా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోతే పాలకులు ఉన్నట్టా...నిద్రపోతున్నట్టా..? అని అడిగారు. పేదల గురించి ఆలోచిస్తున్న నాయకులు లేరని ఆగ్రహాం వ్యక్తం చేశారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం మునుగోడు నియోజకవర్గం రవిగూడెం గ్రామం నుంచి ప్రారంభమై ఎల్లికట్టే క్రాస్ వరకు సాగింది. మునుగోడు మండలంలోని రాతపల్లిలో మాట ముచ్చట నిర్వహించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తుచేశారు. 2 లక్షల ఉద్యోగాలు కళ్ల ముందు ఉన్నా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్నారు. డిగ్రీ, పీజీ చేసిన నిరుద్యోగులు హమాలీ పనికి, ఆటో డ్రైవర్లుగా, కళ్లు గీస్తు, కూరగాయలు అమ్ముకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఫైరయ్యారు.

7 వేల జీతం

7 వేల జీతం

ప్రైవేటు ఉద్యోగం చేసినా 7000 రూపాయలకు నౌకరీ చేస్తున్నారు. కష్టపడి పిల్లల కోసం అప్పులు చేసి చదివించింది ఇంత తక్కువ జీతానికి పని చేసేందుకేనా..? ఇందుకేనా కేసీఆర్‌ను సీఎం చేసుకుంది.? అని అడిగారు. రెండు సార్లు కేసీఆర్ చేతిలో పాలన పెట్టారు. మంచోడు మంచోడు అంటే మంచం కోళ్లు ఎత్తుకెళ్లాడట కేసీఆర్ లాంటి వాడు..? అని ఫైరయ్యారు. ఉద్యమ ఆకాంక్షలన్నీ ఏమయ్యాయి. ఎవరికి ఇచ్చాడు ఉద్యమ ఆకాంక్షలు..? అని అడిగారు. నీళ్లు కేసీఆర్ ఫాం హౌస్‌కి, నిధులు కేసీఆర్ ఇంటికి, నియామకాలు కేసీఆర్ కుటుంబానికే పోయాయి. ఆయన కుటుంబానికి కొడుకుకు, బిడ్డకు, అల్లునికి అందరికీ ఉద్యోగాలు ఉండాలి. సామాన్య ప్రజలకు ఇంట్లో ఒక్కరికి కూడా వద్దు. ఇంటికో ఉద్యోగం, అల్లుడోస్తే ఎక్కడ పడుకోవాలన్నాడు, నిరుద్యోగ భృతి, రుణమాఫీ, మహిళలలకు వడ్డీలేకుండానే రుణాలు, ఒక్కటంటే ఒక్కటైనా నిలబెట్టుకున్నాడా..? అని అడిగారు.

రుపాయిన్నర వడ్డీ

రుపాయిన్నర వడ్డీ

మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేశారు. కేసీఆర్ ఇప్పుడు రుపాయిన్నర వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. అవి మహిళలల ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి. గ్యాస్ 1000, కరెంట్ 800 రూపాయలకు పెరిగాయి. ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్టీలు, ఇంటి పన్ను పెంచుతారంట. ఏ ఒక్క నాయకుడికైనా పేద ప్రజలు ఎలా బతుకుతున్నారని ఆలోచన ఉందా..? పేదల నడ్డి విరుస్తున్నారు కేసీఆర్. ఒక్క మాట నిలబెట్టుకోవడం లేదన్నారు. ఆఖరి గింజ వరకు వరి కొంటా మని కేసీఆర్ చెప్పారా లేదా..? నల్గొండ జిల్లాకు ఒక్క చుక్క నీటి బొట్టు కేసీఆర్ ఇవ్వలేదన్నారు. నల్గొండ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టలేదు. ఆగి పోయిన ప్రాజెక్టులన్నీ వైయస్ఆర్ తలపెట్టినవి అని పేర్కొన్నారు. 600 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు మంచినీళ్లు వస్తున్నాయంటే అది వైయస్ఆర్ పుణ్యమేనని సెలవిచ్చారు.

వరి కొనవా..?

వరి కొనవా..?

కేసీఆర్ చేసింది ఏమీ లేదు. భగవంతుడు ధయ తలచి వానలు వస్తే రైతులు వరి వేసుకుంటే ఇప్పుడు అవి కొనను అంటున్నారు. ఇది న్యాయమేనా..? వడ్లు కొనకపోతే రైతులు ఏం చేయాలి. అమ్మా మేము ఉరి వేసుకోవాలా అని ఆవేదన చెందుతున్నారు. ఇది దొర తనం కాదా..? కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బానిసలా..? పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదని కేసీఆర్ చెబుతున్నారు. ఒక్క సంవత్సరంలోనే కేసీఆర్ 30 రూపాయలు పెట్రోల్, డీజిల్ పై పెంచారు. ఒక్క రూపాయి కూడా పెంచలేదని చెబుతున్నారు. 2015 లో జివో నెంబర్ 237 ప్రకారం 30 శాతం పన్ను ఉన్న పెట్రోల్‌ను 35 శాతానికి, డీజిల్ రేటు 20 శాతం ఉంటే 27 శాతానికి ధరలు కేసీఆర్ పెంచలేదా..? చెప్పిన మాటలో నిజాయితీ ఉంటే.. చార్జీలు పెంచారని నిరూపిస్తే చార్జీలు తగ్గిస్తారా..? మీరు అబద్దాలు చెప్పారని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తారా..? అని అడిగారు. ప్రజల గురించి కేసీఆర్‌కు ఆలోచన లేదు. ఎప్పుడూ ఫాం హౌస్ లోనే ఉన్నాడు. ఎప్పుడు సెక్రెటెరియట్‌కి వచ్చారు. బై ఎలక్షన్ ఉంటేనే వచ్చాడు. బై ఎలక్షన్ ఉంటేనే పథకానికి శ్రీకారం చుట్టారు. ఎలక్షన్ ముగియగానే ఆ పథకం స్విచ్ ఆఫ్ చేస్తాడు. ప్రజల గురించి ఏ రోజైనా పట్టించుకున్నారా..? అని అడిగారు.

పేద పిల్లలకు ఉన్నత విద్య

పేద పిల్లలకు ఉన్నత విద్య

ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా పేదింటి పిల్లలకు ఉన్నత విద్య అందించారు. పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు అయి ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు. వైఎస్ఆర్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 64 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు. ప్రపంచంలో ఎవరూ ఆలోచన చేయని విధంగా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి, పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించారు. 108 సేవలు ప్రవేశపెట్టి, 20 నిమిషాల్లో ఇంటి వద్దకే అంబులెన్స్ వచ్చేలా చేశారు.ఐదేండ్లలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 45లక్షల ఇండ్లు నిర్మిస్తే.. వైయస్ఆర్ గారు ఒక్కరే రాష్ట్రంలో 46లక్షల పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించాలని మొట్టమొదటి ఆలోచన చేసిందే వైయస్ఆర్ అని చెప్పారు. వైయస్ఆర్ అన్ని సంక్షేమ పథకాలను అద్భుతంగా నడిపించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఐదేండ్ల కాలంలో నిరుద్యోగుల కోసం మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. ప్రైవేటు రంగంలో 11 లక్షల ఉద్యోగాలను సృష్టించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్ లోన్లు అందించి స్వయం ఉపాధిని ప్రోత్సహించారని వివరించారు.

పన్ను పెంచలే

పన్ను పెంచలే

ఐదేళ్లలో ఒక్క పన్ను పెంచకుండా పాలన సాగించిన రికార్డు ముఖ్యమంత్రి వైయస్ఆర్‌కు దక్కుతుందని చెప్పారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి, చూపించారు. వైయస్ఆర్ గారు ఎప్పుడూ పేద పిల్లల గురించే ఆలోచించేవారు. కరోనా టైంలో కేసీఆర్ ఒక్కరినైనా ఆదుకున్నారా..? ఒక్కరికైనా జీతం పెరిగిందా..? రాబడి పెరగలేదు. కర్చులు మోపడయ్యాయి. కేసీఆర్ మోసగాడు. గాడిదకు రంగు పూసి ఇది ఆవు అని కేసీఆర్ నమ్మించగలడు. సంక్షేమం, సమానత్వం, సమగ్రాభివృద్ధి కోసమే వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టాం. మా పార్టీ రైతులను, నిరుద్యోగులను, మహిళలలను, విద్యార్థులను, వృద్ధులను ఆదుకుంటాం అని వివరించారు. కరోనా బిల్లులన్నీ, అభయహస్తం డబ్బులు, రైతులకు లాభము వచ్చేలా మద్దతు ధరను, స్వంత ఇంటి కలను మా పార్టీ అధికారంలోకి రాగానే హామీలన్నీ నెరవేరుస్తాం. మా పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం నిరుద్యోగులకు నోటిఫికేషన్లపైనే చేస్తాం.వైయస్ఆర్ సంక్షేమ పాలన ప్రతీ ఇంటికి రావాలన్నదే మా లక్ష్యం అని షర్మిల వివరించారు.

English summary
jobs fill up is our first priority ysrtp chief ys sharmila said. if our party comes to power, first sign is notifications she said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X